ఉద్యోగం ఇష్టంలేక : కూకట్ పల్లిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్ లో విషాదం జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇష్టం లేదని అందుకే చనిపోతున్నానని సూసైడ్ నోటులో రాశాడు. విశాఖలోని

హైదరాబాద్ లో విషాదం జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇష్టం లేదని అందుకే చనిపోతున్నానని సూసైడ్ నోటులో రాశాడు. విశాఖలోని
హైదరాబాద్ లో విషాదం జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇష్టం లేదని అందుకే చనిపోతున్నానని సూసైడ్ నోటులో రాశాడు. విశాఖలోని కుర్మన్నపాలేనికి చెందిన వెంకట మురళికృష్ణారావు కుమారుడు గుండ్ల వెంకట నాగ చైతన్య(23) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్నాడు. ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. శుక్రవారం(సెప్టెంబర్ 13,2019) ఉదయం హాస్టల్ గది నుంచి ఎంతకూ బయటకు రాలేదు. హాస్టల్ నిర్వాహాకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా చైతన్య ఫ్యాన్ కి ఉరివేసుకుని కనిపించాడు. తల్లిదండ్రుల కోరిక మేరకే తాను ఉద్యోగంలో చేరానని చైతన్య సూసైడ్ నోట్ లో రాశాడు. తనకు ఉద్యోగం నచ్చక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపాడు. సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఉద్యోగం నచ్చక ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. చైతన్య ఇక లేడు అనే వార్తతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. కొడుకు మృతి వార్త తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని కంపెనీలో చైతన్య జాబ్ చేస్తున్నాడు. కేబీహెచ్ బీ కాలనీలో రోడ్ నెంబర్ 3లోని ఓ హాస్టల్ లో ఉంటున్నాడు.