బాంబు పేలుడు : ఐదుగురికి గాయాలు

  • Published By: chvmurthy ,Published On : November 5, 2019 / 06:23 AM IST
బాంబు పేలుడు : ఐదుగురికి గాయాలు

Updated On : November 5, 2019 / 6:23 AM IST

మణిపూర్ రాజధాని ఇంపాల్ లో మంగళవారం ఉదయం బాంబు  పేలుడు కలకలం సృష్టించింది.  స్ధానిక తంగల్ బజారు వద్ద పేలుడు సంభవించింది. బాంబు పేలటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు ఉన్నారు.

పేలుడు అనంతరం ఘటనా ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని  కారణాలు అన్వేషిస్తున్నారు.  విస్తృత తనిఖీలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలుడుకు కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు.