అమెరికాలో దారుణం : హైదరాబాద్ యువతి అత్యాచారం, హత్య
అమెరికాలో దారుణం జరిగింది. హైదరాబాద్ యువతి హత్యకు గురైంది. దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌కు చెందిన రూత్ జార్జ్(19) ఉన్నత

అమెరికాలో దారుణం జరిగింది. హైదరాబాద్ యువతి హత్యకు గురైంది. దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌కు చెందిన రూత్ జార్జ్(19) ఉన్నత
అమెరికాలో దారుణం జరిగింది. ఇండో-అమెరికన్ యువతి అత్యాచారం, హత్యకు గురైంది. డొనాల్డ్ తుర్‌మన్ అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. వివరాల్లోకెళితే.. రూత్ జార్జ్(19) తల్లిదండ్రులది హైదరాబాద్. కాగా చాలా కాలం క్రితమే ఆ ఫ్యామిలీ అమెరికాలో సెటిల్ అయ్యింది. రూత్ చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో హానర్స్ చదువుతోంది. శుక్రవారం(నవంబర్ 22,2019) నుంచి ఆమె కనిపించడం లేదని తల్లిదండ్రులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ కోసం సిబ్బంది గాలించగా.. యూనివర్సిటీ గ్యారేజీలో ఆమె మృతదేహం కనిపించింది. తన సొంత కారులోనే వెనుక సీటులో రూత్ మృతదేహం ఉంది.
వర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయం వెలుగు చూసింది. యువతిని రేప్ చేసి, హత్య చేసినట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. డొనాల్డ్ తుర్ మన్(26) ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారించిన పోలీసులు అతడిని చికాగో మెట్రో స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు. అతడిపై హత్య, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
రూత్ జార్జ్ దారుణ హత్యకు గురైందని తెలిసి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగింది అనే దాని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాఫ్తులో భాగంగా వర్సిటీలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అందులో ఓ వ్యక్తి రూత్ జార్జ్ ని ఫాలో అవుతుండటాన్ని గుర్తించారు. ఫుటేజీలో ఉన్న ప్రకారం.. అర్థరాత్రి 1.30గంటల ప్రాంతంలో ఆ వ్యక్తి రూత్ జార్జ్ ని ఫాలో అయ్యాడు. ఆ తర్వాత 2.10 గంటల సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
”హెల్త్ ప్రొఫెఫషనల్‌గా రాణించాలని, ఎందరికో సాయం చేయాలని కలలు కన్న యువతి ఈ విధంగా చనిపోవడం దిగ్ర్భాంతికి గురిచేసింది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి” – వర్సిటీ చాన్స్‌లర్ మైఖేల్ డీ అమిరిడిస్.
నిత్యం నవ్వుతూ కనిపించే స్వీట్ గర్ల్‌ను మిస్ అయ్యామని రూత్ జిమ్నాస్టిక్స్ మాజీ కోచ్ ఆవేదన వ్యక్తం చేశారు. రూత్ మరణం పట్ల తోటి విద్యార్థులు సంతాపం తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగు రాష్ట్రాల వారిని ఆందోళనకు గురి చేసింది.