Intelligence CI Gopikrishna : పోలీసులకు లొంగిపోయిన ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ.. రియల్టర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు
ఓ భూమి కొనుగోలు విషయంలో సాంబయ్య మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తిగా ఉన్న సందర్భంలో గోపీకృష్ణ అదనపు లాభం రావాలని, ఆ లాభం రాకపోతే నువ్వే భరించాలని చెప్పడంతో సాంబయ్య దాదాపు 6లక్షల రూపాయలు వ్యక్తిగతంగా చెల్లించినట్లు తెలుస్తోంది.

Intelligence CI Gopikrishna
Intelligence CI Gopikrishna : కరీంనగర్ జిల్లా చొప్పుదండి మండలం భూపాలపల్లి గ్రామంలో రియల్టర్ బొడిగే శ్యామ్ అలియాస్ సాంబయ్య ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ పోలీసులకు లొంగిపోయారు. దీంతో పోలీసులు గోపీకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఓ భూమి విషయంలో డబ్బుల కోసం సీఐ గోపీకృష్ణ బెదిరించాడని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసి శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫోన్ కాల్ ఆడియోలు బయటకు రావడంతో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడంతో గోపీకృష్ణ పరరయ్యాడు. పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని తెలుసుకొని లొంగిపోయాడు. భూమి విషయంలో సీఐ గోపీకృష్ణ వేధించాడని, ఆ వేధింపులు తట్టుకోలేక శ్యామ్ అలియాస్ సాంబయ్య ఈ సూసైడ్ నోట్ రాసి ఏప్రిల్ 21న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Karimnagar : కరీంనగర్ జిల్లాలో దారుణం.. సీఐ వేధింపులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
అయితే, సాంబయ్య ఆత్మహత్య తర్వాత గోపీకృష్ణ పరారీ ఉన్నాడు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని గోపీకృష్ణ బుధవారం చొప్పదండి పోలీసులకు లొంగిపోయాడు. గోపీకృష్ణను విచారించిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ భూమి కొనుగోలు విషయంలో సాంబయ్య మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తిగా ఉన్న సందర్భంలో గోపీకృష్ణ అదనపు లాభం రావాలని, ఆ లాభం రాకపోతే నువ్వే భరించాలని చెప్పడంతో సాంబయ్య దాదాపు 6లక్షల రూపాయలు వ్యక్తిగతంగా చెల్లించినట్లు తెలుస్తోంది. మిగతా రూ.4లక్షల కోసం తరచూ వేధిస్తున్న కారణంతో డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.