Karimnagar : కరీంనగర్ జిల్లాలో దారుణం.. సీఐ వేధింపులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

Karimnagar : సీఐ గోపీకృష్ణతో తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందన్నాడు. తన డైరీని ఎస్పీ, కలెక్టర్ కి అందజేయాలని కోరాడు.

Karimnagar : కరీంనగర్ జిల్లాలో దారుణం.. సీఐ వేధింపులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

Karimnagar

Karimnagar : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బొడిగే శ్యామ్ అలియాస్ శంబయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ సీఐ గోపీకృష్ణ కారణమని సూసైడ్ నోట్ రాశాడు. ఓ భూమి విషయంలో సీఐ గోపీ తనను బెదిరించాడని నోట్ లో ఆవేదన వ్యక్తం చేశాడు.

సీఐ గోపీకృష్ణతో తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందన్నాడు. తన డైరీని ఎస్పీ, కలెక్టర్ కి అందజేయాలని కోరాడు. గోపీకృష్ణ తనను వదిలిపెట్టడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ లేఖలో రాశాడు. శంబయ్య ఆత్మహత్యతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.(Karimnagar)

Also Read..Nandyal District: కొడుకు, కోడలు, మనవరాలిని కిడ్నాప్ చేయించిన కసాయి.. సుపారీ ఇచ్చి మరీ చిత్రహింసలు

సీఐ గోపీకృష్ణ, మృతుడు శంబయ్య మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. నా బాధలు భరించలేక నేను చనిపోతున్నా అని శంబయ్య అంటే.. నువ్వు చచ్చిపోతే ఏమీ కాదు అని సీఐ గోపీకృష్ణ అనడం అందులో ఉంది. బుద్ధుండాలి. సిగ్గు శరం ఉండాలి అని గోపీకృష్ణ అనడం అందులో ఉంది.

‘నాలుగు నెలల్లో ల్యాండ్ అమ్మేసి నాకు పది లక్షలు కట్టాలి అని మా నాన్నను సీఐ గోపీకృష్ణ బెదిరించాడు. అయితే ల్యాండ్ ను అమ్మలేకపోయాను, డబ్బులు కట్టలేకపోతున్నా అని నాన్న చెప్పాడు. నువ్వు కట్టకపోతే ఎలా? నేను ఊరుకోను అని సీఐ బెదిరించాడు. భయపెట్టి అగ్రిమెంట్ రాయించుకున్నాడు. ల్యాండ్ అమ్మేసి ఫుల్ అమౌంట్ 60లక్షలు కట్టాలి అని బెదిరించాడు. దాంతో నాన్న బాగా ప్రయత్నం చేశాడు. ల్యాండ్ అమ్మటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా సఫర్ అయ్యాడు. మాకు ఎవరికీ విషయం చెప్పలేదు’ అని మృతుడు శంబయ్య కొడుకు మీడియాతో చెప్పాడు.(Karimnagar)

Also Read..Andhra Pradesh : రూ.2 లక్షల 50వేలు లంచం తీసుకొని గంజాయి వాహనాన్ని వదిలేసిన ఎస్సై..

”సీఐ గోపాలకృష్ణ, మా ఆయనకు మధ్య ఏమున్నదో తెలియదు. 50లక్షలకు భూమి ఇప్పిస్తే, నాలుగు నెలల్లో అమ్మిపెట్టు అని వేధించాడు. నీకు పది లక్షలు ఇస్తాను అన్నాడట. నాలుగు నెలలు అయినా భూమి పోలేదు. మా ఆయన ఇంట్లో నుంచి డబ్బు తీసుకెళ్లాడు. అన్నీ కొదవ పెట్టాడు. పిల్లల బంగారం కూడా అమ్మేశాడు. ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సీఐ సార్ అంత భయం ఏం పెట్టాడో తెలియదు కానీ, మా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు” అని మృతుడు శంబయ్య భార్య కన్నీరుమున్నీరు అయ్యారు.