Facebook Lover : మూడేళ్ల ఫేస్ బుక్ ప్రేమ…ప్రియురాలిని వదిలించుకునేందుకు..

Facebook Lover : మూడేళ్ల ఫేస్ బుక్ ప్రేమ…ప్రియురాలిని వదిలించుకునేందుకు..

Facebook Lover

Updated On : April 21, 2021 / 5:51 PM IST

Jharkhand girl getting robbed and thrashed by facebook lover :  ఫేస్ బుక్ లో పరిచయం అయిన స్నేహితులు ప్రేమికులుగా మారారు. మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ప్రియుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకోటానికి నిరాకరించాడు. ఆమెపై దాడి చేసి గాయపరిచాడు.

జార్ఖండ్ లోని రాంచీకి చెందిన యువతి ఉద్యోగ రీత్యా ముంబైలో నివసిస్తోంది. ఆమెకు ఫేస్ బుక్ ద్వారా పాట్నాలో నివసిస్తున్న అభిషేక్ ఠాకూర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫేస్ బుక్ చాటింగ్ తో మొదలైన పరిచయం క్రమేపి ఫోన్ కాల్స్ వాట్సప్ చాటింగ్ దాకా వచ్చారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు.

మూడేళ్లుగా ఇద్దరూ చాలా దగ్గరయ్యారు. అభిషేక్ కూడా ముంబై వచ్చాడు. ఇద్దరూ సహజీవనం చేయసాగారు. ఆమె తాను దాచుకున్నడబ్బులతో ప్రియుడికి బైక్ కొనిచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తన ఇంట్లో పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామని యువతికి చెప్పాడు ప్రియుడు.

పెళ్లికి కావాల్సిన నగలు,నగదుఅంతా తీసుకుని ముంబై నుంచి ఇద్దరూ పాట్నా బయలుదేరారు. మార్గమధ్యలో ప్రియుడి మనసు మారిపోయింది.గొడ్డా దాకా రాగానే తనఇంటికి వెళ్లటానికి ఆసక్తి చూపించలేదు. తిరిగి ముంబై వెళ్లిపోదామని చెప్పాడు. అతని నిర్ణయానికి షాక్ కు గురైన యువతి అతడ్ని నిలదీసింది.

దీంతో అభిషేక్ ఆ యువతి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి … ఆమె వద్ద ఉన్న రూ.1.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయాడు. వెంటనే ఆయువతి సమీపంలోని పోలీసు స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి అతడి వద్దనుంచి నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.