Jubilee Hills Gang Rape : జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు-టాటూ లా ఉండాలనే మెడపై కొరికాము

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈకేసులో బాధితురాలి మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది.

Jubilee Hills Gang Rape : జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు-టాటూ లా ఉండాలనే మెడపై కొరికాము

Jubilee Hills Gang Rape Case

Updated On : June 12, 2022 / 3:09 PM IST

Jubilee Hills Gang Rape : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈకేసులో బాధితురాలి మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది.  బాలిక మెడపై నిందితులు కొరికిన గుర్తులు ఉన్నాయి. మైనర్ బాలిక‌ మెడపై తీవ్రంగా కొరకడం, రక్కడంతో గాయాలు అయ్యాయి. బాలిక మెడపై టాటూలా ఉండాలనే,  మెడపై కొరికినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో  చెప్పారు.

ఈరోజు ఆరుగురు నిందితులను జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో ఏసీపీ సుదర్శన్ విచారిస్తున్నారు. సీన్ రీ కనస్ట్రక్షన్ కోసం నిందితులను అమ్నేశియా పబ్ నుంచి రోడ్ నెంబరు 36 కు తీసుకువెళ్ళారు పోలీసులు. ఈకేసులో మరో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫుటేజిలో ఎరుపు రంగు బెంజి కారులో మైనర్ బాలిక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుండి ప్రయాణిస్తన్న ఆధారాలు దొరికాయి.

నిన్న ముగ్గురు మైనర్లను ఓ మేజర్‌ను గంటపాటు ఇంటరాగేట్ చేసిన విచారణ అధికారి. పబ్‌లో బాలికను పరిచయం చేసుకునప్పటి నుండి ట్రాప్‌లోకి దించడం…అనంతరం అత్యాచార ఘటన… మరుసటి రెండు రోజుల వరకు అసలు ఏం జరిగింది…. ఎక్కడికి పరార్ అయ్యారు, ఎవరి సహాయంతో తెలంగాణ స్టేట్ దాటారు… ఇలా అనేక కోణాల్లో విచారించారు. సాదుద్దీన్ మాలిక్ కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. పోలీసులు నిన్న ఆరుగురు నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో పొటెన్సీ పరీక్షలు నిర్వహించారు.

Also Read : Drugs Seized : విశాఖలో మాదక ద్రవ్యాలు స్వాధీనం-ఒకరి అరెస్ట్