ఆంటీతో 15 ఏళ్ల బాలుడు అక్రమ సంబంధం..బ్లాక్ మెయిల్ చేయటంతో హత్య

  • Published By: chvmurthy ,Published On : February 15, 2020 / 01:10 PM IST
ఆంటీతో 15 ఏళ్ల బాలుడు అక్రమ సంబంధం..బ్లాక్ మెయిల్ చేయటంతో హత్య

Updated On : February 15, 2020 / 1:10 PM IST

మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని… బ్లాక్ మెయిల్ చేసిన మహిళ  చివరికి ఆ బాలుడి చేతిలో కన్నుమూసిన ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. జనవరి 14న జరిగిన ఈహత్యకేసులో నిందితుడు 15 ఏళ్ల బాలుడని తేలటంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసు విచారణలో భాగంగా దాదాపు నెలరోజుల తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జువైనల్ హోమ్ కు తరలించారు. 

మహిళ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయటం తోటే కిరాతకంగా హత్య చేసినట్లు బాలుడు ఒప్పుకోవటంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. జనవరి 14 సంక్రాంతి పండుగ రోజున అతి కిరాతకంగా హత్య చేయబడి ఉన్న ఒక 35 ఏళ్ల మహిళ మృతదేహాన్ని విల్లుపురం రైల్వే కాలనీలోని ఒక పాడుపడిన ఇంటిలో పోలీసులు కనుగొన్నారు. ఆ మహిళ ఒంటిపై దుస్తులు లేవు. నిందితుడు ఆమెను తలపై బండరాయితో కొట్టి చంపినట్లు….శరీరంలో నరాలు కోసి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. 
 

ఆమె శరీరంలో నరాలు కట్ చేయటం వలన ఎక్కవ రక్తస్రావం జరిగటంతో ఆ మహిళ త్వరగా మరణించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. మరణించటానికి ముందు మహిళ పురుషుడితో శారీరక సుఖం అనుభవించినట్లు వైద్యులు తెలిపారు.విల్లుపురం దక్షిణ రైల్వే కోలనీలో  చాలా వరకు పాడు పడిన ఇళ్ళు ఉన్నాయి. ఓ 10 ఇళ్లలో మాత్రమే కొందరు నివసిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు రైల్వే కోలనీకి వచ్చి స్ధానికులను ప్రశ్నించారు. 
 

జనవరి 14 సాయంత్రం వేళలో ఒక మహిళ, బాలుడితో ఆప్రాంతంలో సంచరించినట్లు కొందరు తెలిపారు. బాలుడి రూపు రేఖలు తెలుసుకున్న పోలీసులు రైల్వే కోలనీలో తిరిగే  ఆవయస్సు గల బాలురు పై నిఘా పెట్టారు.  చివరికి విల్లుపురం రైల్వే స్టేషన్ క్యాంటిన్లో పని చేసే బాలుడే నేరస్తుడని నిర్ధారించుకుని ఫిబ్రవరి 11 న అనుమానిత బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 
 

జనవరి 14 రాత్రి 10 గంటల సమయంలో మరణించిన మహిళతో బాలుడు పాడుబడిన ఇంటిలోకి వెళ్ళాడు. అక్కడ ఆమెతో శారీరకంగా కలిశానని బాలుడు ఒప్పుకున్నాడు. ఆమెతో శారీరకంగా అనుభవించిన అనంతరం ఆ మహిళ  తనను  డబ్బులు డిమాండ్ చేసిందని చెప్పాడు.  తన వద్ద ఉన్న డబ్బులు కొంత ఆమెకు ఇచ్చాడు. ఆమె ఇంకా డబ్బులు డిమాండ్ చేయటంతో తన వద్ద ఇవ్వటానికి డబ్బులు లేవని తేల్చి చెప్పాడు. డబ్బులు ఇవ్వక పోతే రేప్ చేశావని…పోలీసులకు, మీ పెద్దవాళ్లకు చెపుతానని బాలుడిని.. ఆ మహిళ బెదిరించిందని తెలిపాడు.

ఆమె బెదిరించే సరికి భయపడి అక్కడే ఉన్న ఇటుక రాళ్లతో ఆమెను కిరాతకంగా హత్యచేసినట్లు ఒప్పకున్నాడు. బాలుడిని అరెస్టు చేసి పోలీసులు న్యాయస్ధానంలో హజరు పరిచారు. నిందితుడు మైనర్ కావటంతో న్యాయమూర్తి బాలుడిని కడలూరులోని జువైనల్ హోం కు తరలించారు. నిందితుడు ఇచ్చిన సమాచారం తో మరణించిన మహిళల వివరాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. మహిళ స్థానికురాలా ?  లేదా ఆ ఏరియాలోనే వేశ్యా వృత్తిలో ఉన్న మహిళా? లేక ఎక్కడి నుంచి వచ్చింది? మొదలైన అంశాలపై కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

Read More >>ట్రంప్ స్వాగతం కోసం నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు,మై కేజ్రీవాల్..సీఎంగా ప్రమాణ స్వీకారం