Kamareddy SI Case : కామారెడ్డి జిల్లా ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ కేసు.. బయటపడ్డ ఆ ముగ్గురి వాట్సాప్ హిస్టరీ..! అందులో ఏముందంటే..

పోలీసులు ఆ బైక్ ఎక్కడుంది అనే కోణంలో కూడా దర్యాఫ్తు చేస్తున్నారు.

Kamareddy SI Case : కామారెడ్డి జిల్లా ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ కేసు.. బయటపడ్డ ఆ ముగ్గురి వాట్సాప్ హిస్టరీ..! అందులో ఏముందంటే..

Updated On : December 27, 2024 / 4:52 PM IST

Kamareddy SI Case : కామారెడ్డిలో మిస్టరీగా మారిన ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కేసులో స్పీడ్ పెంచారు పోలీసులు. ఈ కేసులో ఆ ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ హిస్టరీ తీస్తున్నారు. ఈ కాల్ డేటాలో ముగ్గురూ వారం రోజులుగా గంటల తరబడి మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది.

మరోవైపు, బీబీ పేట నుంచి కామారెడ్డి మండలం నరసన్నపల్లికి బైక్ పై వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ అక్కడ ఎస్ఐ సాయికుమార్ కారులో ఎక్కాడు. అయితే, నిఖిల్ తీసుకొచ్చిన బైక్ ఎక్కడుంది ఇంకా ఆచూకీ తెలియరాలేదు. దీంతో పోలీసులు ఆ బైక్ ఎక్కడుంది అనే కోణంలో కూడా దర్యాఫ్తు చేస్తున్నారు.

Kamareddy Dist SI Case

Kamareddy Dist SI Case

సంచలనంగా మారిన ముగ్గురి మృతి కేసు..
కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ముగ్గురి అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగింది? ఆ ముగ్గురి మృతికి కారణం ఏంటి? అనేది మిస్టరీగా మారింది. ఆ ముగ్గురి మరణం వెనుకున్న మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. సదాశివనగర్ కు సంబంధించిన సీఐకి కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు. అసలు ఈ ముగ్గురి మరణం వెనుక ఏం జరిగింది? అనేది పోలీసుల విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Also Read : వీడిన మిస్టరీ.. పార్శిల్‌లో మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..

ప్రస్తుతం దర్యాఫ్తు కొనసాగుతోంది. బికనూరు ఎస్ఐ సాయికుమార్ కు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఇక, సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్.. ఈ ముగ్గురి కాల్ డేటాను సేకరించారు. అలాగే వాట్సాప్ చాట్ ను కూడా సేకరించారు. దాదాపు వారం రోజుల పాటు ఈ ముగ్గురూ గంటల తరబడి మాట్లాడుకున్నట్లు అందులో తేలింది.

ముగ్గురూ కలిసి కారులో ఎక్కడికి వెళ్లారు?
బికనూరు ఎస్ఐ సాయికుమార్ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో బికనూరు టోల్ ప్లాజా వద్ద ఆయన కారులో వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆయన ఒక్కడే కామారెడ్డి వైపు వస్తున్నట్లు అందులో ఉంది. అటు కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్ కామారెడ్డి చేరుకున్నారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి కారులో ఎటు వెళ్లారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. వారు నేరుగా అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వెళ్లారా? లేక మరో చోటుకి వెళ్లారా? ఎక్కడైనా భోజనం చేశారా? ఈ దిశగా పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Kamareddy SI Saikumar Case

Kamareddy SI Saikumar Case

చెరువు దగ్గర ఏం జరిగింది? ఘర్షణ పడ్డారా?
ఇక నిఖిల్ కు సంబంధించిన బైక్ మిస్ అయ్యింది. కామారెడ్డి మండలం నరసన్నపల్లికి వచ్చిన తర్వాత నిఖిల్ బైక్ ఎక్కడ పెట్టాడు? అసలు అతడి బైక్ ఏమైంది? అనేది మిస్టరీగా మారింది. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా దర్యాఫ్తులో కొంత కీలక సమాచారం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఘర్షణ పడ్డ తర్వాత ముగ్గురిలో ఒకరు ఆత్మహత్య చేసుకుని ఉంటే, మిగతా ఇద్దరూ భయపడి వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

 

Also Read : పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్‌జే సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద మృతి..