Karimnagar Deaths Case : వ్యాధి కాదు, చేతబడి కాదు.. కెమికల్ మర్డర్స్..! కరీంనగర్ గంగాధర మరణాల మిస్టరీని చేధించిన పోలీసులు
సంచలనం రేపిన కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో తల్లీబిడ్డల మరణాల కేసులో మిస్టరీ వీడుతోంది. ఈ కేసుని పోలీసులు దాదాపుగా చేధించారు. ఆర్సనిక్ ఓవర్ డోస్ కారణంగానే తల్లీ పిల్లలు మృతి చెందినట్లుగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇచ్చింది.

Karimnagar Deaths Case : సంచలనం రేపిన కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో తల్లీబిడ్డల మరణాల కేసులో మిస్టరీ వీడుతోంది. ఈ కేసుని పోలీసులు దాదాపుగా చేధించారు. ఆర్సనిక్ ఓవర్ డోస్ కారణంగానే తల్లీ పిల్లలు మృతి చెందినట్లుగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇచ్చింది. వారికి కెమికల్ ఎవరిచ్చారు? భర్త శ్రీకాంతే ఇచ్చాడా? లేక ప్రయోగం చేశాడా? అన్న అంశాన్ని తేల్చాల్సి ఉంది.
ఆర్సనిక్ రసాయాన్ని బ్యాటరీలతో పాటు దోమల నివారణ లిక్విడ్ లో ఉపయోగిస్తారు. డిసెంబర్ 31న సోడియం హైడ్రాక్సైడ్ గుళికలు తీసుకుని శ్రీకాంత్ మృతి చెందాడు. శ్రీకాంత్ ఇచ్చిన క్లూతో అతడి భార్య మమత, కూతురు అమూల్య, కొడుకు అద్వైత్ కు కూడా సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కరీంనగర్ పోలీసులకు వచ్చిన రిపోర్టులో ఆర్సనిక్ ఓవర్ డోస్ వారి మరణాలకు కారణమని తేలింది. శ్రీకాంత్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే, అతడి భార్య పిల్లల చావుకి ఆర్సనిక్ హైలెవల్ డోస్ కారణమని తేలింది. శ్రీకాంతే కుటుంబసభ్యులపై ప్రయోగం చేశాడా? లేదా రసాయనాలు ఇచ్చి మర్డర్లు చేశాడా? అన్నది తేలాల్సి ఉంది.
ముందుగా అంతుచిక్కని వింత వ్యాధితో రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారని ప్రచారం జరిగింది. ముగ్గురూ ఒకే రకమైన లక్షణాలతో చనిపోవడం కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఈ కేసుని సవాల్ గా తీసుకున్నారు. మృతుల శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత శ్రీకాంత్ కూడా చనిపోయాడు. ఆత్యహత్య చేసుకునే ముందు అతడు ఇచ్చిన క్లూ ఆధారంగా పోలీసులు కేసుని దాదాపుగా చేధించారు.
గంగాధరలో 33 రోజుల వ్యవధిలో తల్లి మమత, ఇద్దరు పిల్లలు అమూల్య, అద్వైత్ రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారు. అసలీ ముగ్గురు ఎలా చనిపోయారన్నది ఎవరికీ అంతు చిక్కలేదు. దీంతో ఇది అంతుచిక్కని వ్యాధి అని అందరూ భావించారు. చేతబడి వల్ల చనిపోయారని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
కానీ, ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాంత్ తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలకు సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ తో శ్రీకాంతే ఆ ముగ్గురినీ చంపి ఉంటాడని భావిస్తున్నారు. దీన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
శ్రీకాంత్ ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో పీజీ చేశాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ సైన్స్ లెక్చరర్ గా పని చేశాడు. కెమికల్స్ ఎలా పని చేస్తాయి అనే దానిపై అతడికి అవగాహన ఉంది. దీంతో శ్రీకాంత్ తన భార్య ఇద్దరు పిల్లలపై రసాయన ప్రయోగాలు చేసి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారణ జరిపారు. సోడియం హైడ్రాక్సైడ్ ను ఏ ల్యాబ్ నుంచి తీసుకొచ్చాడు? అన్న అంశంపై ఆరా తీస్తున్నారు.