భార్య, భర్త, మరో మహిళ… ఒకే గదిలో శవాలుగా.. ఏం జరిగింది?

వేరే రాష్ట్రానికి వెళ్లి హోటల్ రూములో ముగ్గరూ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగిందనేది అంతు పట్టకుండా ఉంది.

భార్య, భర్త, మరో మహిళ… ఒకే గదిలో శవాలుగా.. ఏం జరిగింది?

Kerala Couple Death: డాక్టర్ దంపతులతో పాటు వారి ఫ్రెండ్ ఒకే గదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై కేరళ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రత్యేక టీమ్‌ను అరుణాల్‌ప్ర‌దేశ్‌కు పంపించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మ్యారీడ్ కపుల్‌తో పాటు మహిళ ఒకే గదిలో చనిపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని తిరువనంతపురం నగర పోలీసు కమిషనర్ సి నాగరాజు తెలిపారు. మృతుల మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించే వరకు ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. మరోవైపు ఈ ముగ్గురి మరణానికి చేతబడి కారణమన్న వదంతులు వినిపిస్తున్నాయి.

అసలేం జరిగింది?
కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన నవీన్, ఆయన భార్య దేవి ఆయుర్వేద వైద్యులు. తిరువనంతపురానికి చెందిన తమ స్నేహితురాలు ఆర్యతో కలిసి వీరు మార్చి 28న అరుణాల్‌ప్ర‌దేశ్‌కు వెళ్లారు. లోయర్ సుబన్‌సిరి జిల్లాలోని హపోలీలో ఉన్న బ్లూపైన్ హోటల్‌లో బ‌స చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ మంగళవారం (ఏప్రిల్ 3) ఈ ముగ్గురు హోటల్‌ రూములో విగత జీవులుగా కనిపించారు. వీరు బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని అరుణాల్‌ప్ర‌దేశ్‌ పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే చేతబడి జరిగివుండొచ్చని నవీన్ తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో కేసు మలుపు తిరిగింది.

అక్కడికి ఎందుకెళ్లారు?
ఈ ముగ్గురు చాలా చనిపోయారనేది ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు పూర్తైన తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని కేరళ పోలీసులు అంటున్నారు. చేతబడి లేదా అలాంటిదేదో వీరికి కారణమని ఇప్పుడే చెప్పలేం. ఆధారాలను సేకరించేందుకు మా టీమ్ అరుణాల్‌ప్ర‌దేశ్‌కు వెళ్లింది. ప్రొసీజర్స్ అన్ని పూర్తైన తర్వాత మేము అక్కడ నుంచి ఆధారాలను తీసుకురాగలము. కాబట్టి కొంత సమయం పడుతుంద” ని తిరువనంతపురం పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ ముగ్గురు అక్కడికి ఎందుకు వెళ్లారు, వారి మరణాలు ఎలా సంభవించాయనేది దర్యాప్తులో వెల్లడవుతుందన్నారు.

Also Read: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో విషాదం.. పాపం పెళ్లైన కొన్ని నెలలకే..

కాగా, నవీన్, దేవికి 13 ఏళ్ల క్రితం వివాహమైందని.. అప్పుడప్పుడు కొట్టాయంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లేవారని నవీన్‌ కుటుంబానికి సమీపంలోని స్థానికులు తెలిపారు. ఉన్నత విద్యావంతులైన వీరు మూఢనమ్మకాల ఉచ్చులో చిక్కుకోవడం బాధాకరమని అన్నారు. చనిపోచయిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా, మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల విచారణలో తేలాల్సివుంది.

Also Read: యూఎస్‌బీ ఛార్జర్ స్కామ్‌తో జాగ్రత్త.. మీ ఫోన్ కనెక్ట్ చేశారంటే అంతే.. సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి!