ఫోన్ దొంగిలించాడని అవి కాల్చేశారు!!

అమానవీయ నేరాలకు పాల్పడిన వ్యక్తులకే భారీ శిక్షలు విధించడం లేదు. ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడి దారుణంగా హింసించారు. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది. తిరువల్లొమ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వృషణాలను కోసేశారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్లు ఉన్నట్లు గుర్తించి వారిపై అదుపులోకి తీసుకున్నారు.
తిరువనంతపురం బస్టాండ్ లో నిద్రపోతున్న వ్యక్తి పర్సు, ఫోన్ మిస్సయ్యాయి. అక్కడ ఉన్న వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్లు అనుమానపడ్డారు ఆటో డ్రైవర్లు. ఏడుగురు కలిసి ఆ వ్యక్తిని చితకబాదారు. వృషణాలను కోసి ఆ ప్రదేశంలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. మంటలు పెరిగి మనిషి 40శాతం కాలిపోయాడు.
చికిత్స నిమిత్తం తరలించినప్పటికీ వైద్యులు బతికించలేకపోయారు. ప్రైవేట్ బాడీ పార్ట్స్ లో కాల్చడం వల్ల చనిపోయాడని డాక్టర్లు తేల్చిచెప్పారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్టాండ్ సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఐదుగురిని నజీర్, దినేశ్ వర్గీసె, అరుణ్, సాజన్, రాబిన్‌సన్‌లను పట్టుకోగలిగారు.