Alappuzha : కేరళను వణికిస్తున్న రాజకీయ హత్యలు..పది గంటల్లో ఇద్దరు మృతి

కేరళ రాష్ట్రంలో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. అలప్పుజాలో గత పది గంటల్లో ఇద్దరు నేతలు దారుణ హత్యకు గురయ్యారు.

Alappuzha : కేరళను వణికిస్తున్న రాజకీయ హత్యలు..పది గంటల్లో ఇద్దరు మృతి

Kerala (1)

Updated On : December 19, 2021 / 11:25 AM IST

Alappuzha Murders : కేరళ రాష్ట్రంలో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. అలప్పుజాలో గత పది గంటల్లో ఇద్దరు నేతలు దారుణ హత్యకు గురయ్యారు. దీంతో పోలీసులు అలర్ట్ అయి 144 సెక్షన్ విధించారు. SDPI లీడర్ కేఎస్ ఖాన్ హత్య తర్వాత..బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాస్ ను దారుణంగా హత్య చేశారు. ఆదివారం..అతని ఇంట్లోకి చొరబడి హత్య చేశారు. ఇతను ఓబీసీ మోర్చా కేరళ రాష్ట్ర కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు. రంజిత్ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అలప్పుజా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది.

Read More : Covid Compensation Portal : కోవిడ్ పరిహారం కోసం కొత్త పోర్టల్ తెచ్చిన ఏపీ.. దరఖాస్తు తప్పనిసరి

కేఎస్ షాన్ పై జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మన్నన్ చేరి వద్ద షాన్ ప్రయాణిస్తున్న బైక్ ను కారుతో ఢీ కొట్టారు. అనంతరం అతనిపైకి దాడికి పాల్పడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా…చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. అలప్పుజా జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ అలెగ్జాండర్ తెలిపారు. ఈ రెండు హత్యలపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. హత్యలను ఖండిస్తున్నట్లు సీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది.