Uttar Pradesh: తప్పు చేశాను. కాకపోతే.. తోటి విద్యార్థులతో ముస్లిం విద్యార్థిని కొట్టిన టీచర్ వివరణ

వాస్తవానికి చాలా మంది ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ఫీజు కట్టే పరిస్థితిలో లేరని వారిని తాను ఉచితంగా చదువు చెప్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు

Uttar Pradesh: తప్పు చేశాను. కాకపోతే.. తోటి విద్యార్థులతో ముస్లిం విద్యార్థిని కొట్టిన టీచర్ వివరణ

Tripta Tyagi: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‭నగర్‭కు చెందిన ఒక స్కూల్ టీచర్ తోటి విద్యార్థులతో ఒక ముస్లిం విద్యార్థి చెంపల మీద కొట్టించిన వీడియో చూసే ఉంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అయి, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఆమె క్షమాపణలు కోరారు. అయితే తాను అలా కొట్టించడంలో మత విధ్వేషాలు ఏమీ లేవని, విద్యార్థి సామర్థ్యాన్ని పెంచేందుకు అలా చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Meerut: రెండో పెళ్లిని వ్యతిరేకించాడని ఒక్కగానొక్క కొడుకు తల పగలగొట్టి దారుణంగా హత్య చేసిన తండ్రి

ఆ టీచర్ పేరు త్రిప్తా త్యాగి (60). విమర్శలు పెద్ద ఎత్తున రాగానే వీడియో సందేశం ద్వారా క్షమాపణలు కోరారు. ‘‘నేను తప్పుచేశాను. చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటున్నాను. కానీ ఇందులో హిందూ-ముస్లిం వంటి కోణం ఏమీ లేదు. ఆ విద్యార్థి హోంవర్క్ చేయలేదు. అతడికి పాఠం నేర్పేందుకే విద్యార్థులతో కొట్టించాను. నేను లేవలేను. అందుకే చిన్నారులతో అలా కొట్టించాను. సరిగ్గా చదవమని విద్యార్థికి అనేక సార్లు చెప్పాను. కానీ అతడు దారిలోకి రాలేదు. అందులే అలా చేయాల్సి వచ్చింది’’ అని త్రిప్తా అన్నారు.

Mayawati: దళితుల విషయంలో కులతత్వ మీడియా పద్దతి మారాలంటూ మాస్ వార్నింగ్ ఇచ్చిన మాయావతి

వాస్తవానికి చాలా మంది ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ఫీజు కట్టే పరిస్థితిలో లేరని వారిని తాను ఉచితంగా చదువు చెప్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఆధారంగా ఆమెపై పోలీస్ కేసు నమోదు అయింది. అంతే కాకుండా ప్రస్తుతం ఆ పాఠశాలను మూసివేశారు. అందులోని విద్యార్థుల్ని సమీపంలోని పాఠశాలలకు పంపించారు. అయితే ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలుడు సరిగా నిద్రపోవడం లేదని, అనారోగ్యంతో ఇంకా చికిత్స తీసుకుంటున్నట్లు తండ్రి చెప్పారు.