సెక్యూరిటీ గార్డుకు గన్ గురిపెట్టడమే కాక ATM పేల్చి రూ.22లక్షలు చోరీ

ఏటీఎం బద్ధలుకొట్టి రూ.22లక్షలు దోచుకుపోయారుడు దుండగులు. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాల్లో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ATM సెక్యూరిటీ గార్డుకు గన్ గురిపెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సిమారియా టౌన్ లోని నేషనలైజ్డ్ బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 60కిలోమీటర్ల దూరంలో భారీ దొంగతనం జరగడం గమనార్హం.
మోటార్ సైకిళ్లపై గుర్తు తెలియన వ్యక్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు అర్ధరాత్రి 2గంటల సమయంలో వచ్చారు. పేలుడు పదార్థాలను ఉపయోగించి ఏటీఎం పేల్చేశారని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మయాంక్ అవాస్తీ రిపోర్టర్లతో చెప్పారు.
బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనం జరిగిన సమయంలో ఏటీఎంలో 22నుంచి రూ.23లక్షల వరకూ నగదు ఉందని అంటున్నారు. దొంగలను పట్టుకునే క్రమంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు త్వరలోనే నేరస్థులను పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఏటీఎం గార్డ్ సుఖేంద్ర చౌదరి.. ఇద్దరు వ్యక్తులు నల్ల మోటార్ సైకిల్ పై 2గంటల సమంలో వచ్చి తోసేశారని చెప్పాడు. వారిలో ఒకరు వచ్చి గన్ పాయింట్ లో గురిపెట్టి ఏటీఎం మెషీన్ పేల్చారని తెలిపారు. ఆ తర్వాత డబ్బులతో పరారయ్యారని చెప్పాడు.