డాక్టర్ ప్రియాంక ముందు జాగ్రత్తే.. నిందితులను పట్టించింది

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక ముందు జాగ్రత్తే.. నిందితులను పట్టించింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఆధారంగా నిలిచింది. ఈ కేసు

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 05:38 AM IST
డాక్టర్ ప్రియాంక ముందు జాగ్రత్తే.. నిందితులను పట్టించింది

Updated On : December 1, 2019 / 5:38 AM IST

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక ముందు జాగ్రత్తే.. నిందితులను పట్టించింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఆధారంగా నిలిచింది. ఈ కేసు

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక ముందు జాగ్రత్తే.. నిందితులను పట్టించింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఆధారంగా నిలిచింది. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు ప్రియాంక మొబైల్‌ కీలకంగా మారింది. ప్రియాంక తిరిగి రాగానే.. మేడమ్‌.. మీ స్కూటీ పంక్చర్‌ పడింది. మేం సాయం చేస్తాం అని మొదటి ముద్దాయి మహ్మద్‌ నమ్మబలికాడు. వద్దని వెళ్లిపోతున్నా వెంటపడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వారికి వాహనం ఇచ్చింది. ఈ క్రమంలోనే.. వాహనాన్ని వాళ్లు తిరిగి తీసుకురాకపోతే ఎలా అనే అనుమానంతో ఆమె మహ్మద్‌ ఫోన్‌ నంబర్‌ తీసుకుంది. అదే నిందితులను పోలీసులకు పట్టించింది.

ప్రియాంక అడగటంతో మహ్మద్‌ తన ఫోన్ నంబర్‌ ని ప్రియాంకకు ఇచ్చాడు. మిగవాళ్లు వాహనం తీసుకెళ్లారు. ఈలోపు ప్రియాంక తన సోదరితో మాట్లాడింది. పావు గంట అయినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి మహ్మద్‌కు ఫోన్‌ చేసింది ప్రియాంక. నా వాహనం ఎక్కడా…? అని అడిగింది. ఇదే ఆమె ఫోన్‌ నుంచి చివరి కాల్‌. ఈ ఫోన్‌ కాలే నిందితులను ఈజీగా పట్టించేసింది.

ప్రియాంక ఫోన్‌ కాల్‌ పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ప్రియాంక ఫోన్‌ రా.9.48 గంటకు స్విచ్ఛాఫ్‌ అయింది. ఆమె తన సోదరితో మాట్లాడిన తర్వాత మరొకరికి ఫోన్‌ చేసినట్లు దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. అది ఎవరిదని ఆరా తీశారు. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా లారీ డ్రైవర్‌ మహ్మద్‌ను గుర్తించారు. లారీలో తనిఖీ చేయగా, రక్తపు మరకలు, ఇతర ఆధారాలు దొరికాయి. వెంటనే మహ్మద్‌ ఇంటికి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా.. అసలు విషయం బయటపడింది. ప్రియాంక చివరి ఆలోచనే నిందితులను పక్కాగా ఇరికించేసింది. 

హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌పై అఘాయిత్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల రాక్షస కాండ బయటపడింది. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చంపేసిన తర్వాత కూడా ఆ కామాంధులు మృతదేహంపైనా అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో ప్రియాంక కుటుంబసభ్యులతో పాటు పోలీసులు దిగ్భ్రాంతి చెందారు.

బుధవారం (నవంబర్ 27,2019) రాత్రి నుంచి ప్రియాంక రెడ్డి ఆచూకీ లేదు. గురువారం(నవంబర్ 28,2019) ఉదయం ఆమె మృతదేహం కనిపించింది. మృతదేహం దారుణ స్థితిలో ఉంది. గుర్తుపట్టడానికి వీలు లేకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు.