Bihar : ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కిందపడేసి కొట్టిన బైకర్

జెహనాబాద్ ప్రాంతంలో రోడ్డుపై అడ్డంగా బైక్ ఆపడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా పెట్టిన బైక్ తీయాలని అక్కడనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సూచించాడు.

Bihar : ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కిందపడేసి కొట్టిన బైకర్

Trafic

Updated On : October 2, 2021 / 11:41 AM IST

Man Attacked a Traffic Policeman : బైక్ ను రోడ్డు మీద అడ్డంగా ఎందుకు ఆపావు ? వెంటనే తీసెయి.. ట్రాఫిక్ జాం అవుతోంది.. అన్న పాపానికి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కిందపడేసి కొట్టాడు ఓ బైకర్. ఇదంతా నడి రోడ్డుపై చోటు చేసుకుంది. ఇతరులు అతడిని ఆపే ప్రయత్నం చేసినా.. అతను మాత్రం ఆగలేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ముష్టిఘాతాలను కురిపించాడు. అక్కడే ఉన్న ఇతర కానిస్టేబుల్ లు రావడంతో అతను పారిపోయాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…

జెహనాబాద్ ప్రాంతంలో రోడ్డుపై ఓ వ్యక్తి అడ్డంగా బైక్ ఆపడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా పెట్టిన బైక్ తీయాలని అక్కడనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సూచించాడు. ఏమైందో ఏమో..ఆ వ్యక్తికి అలా అనడం ఆగ్రహాన్ని తెప్పించింది. పోలీసుతో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అమాంతం కానిస్టేబుల్ ను కిందపడేసి ముష్టిఘాతాలను కురిపించాడు. అడ్డుకొనే ప్రయత్నం చేశాడు కానిస్టేబుల్. కర్రతో కొట్టాడు. ఇతర కానిస్టేబుల్ రావడంతో..బైక్ ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.