Man Beaten to Death In Public: సోదరుడి హత్యపై ప్రతీకారంతో వెళ్లి.. బహిరంగ ప్రదేశంలో దారుణ హత్యకు గురయ్యాడు
రాహుల్, అజయ్, ముకేష్, ఇతరులు కలిసి కర్రలు, రాడ్లతో సునిల్ను విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి వచ్చి తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సునిల్ను ఆసుపత్రికి తరలించే ప్రతయ్నం చేశారు. అయితే ఆసుపత్రికి వెళ్లేలోపే మరణించినట్లు పోలీసులు తెలిపారు

Man Beaten to Death In Public In Delhi
Man Beaten to Death In Public: తన సోదరుడిని చంపిన వ్యక్తులపై పగ తీర్చుకోవడానికి వెళ్లిన వ్యక్తి పట్టపగలు, అందరూ చూస్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తిమర్పూర్ ప్రాంతంలో ఆగస్టు 13న ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. చనిపోయిన వ్యక్తి సునిల్ గిన్ని(31) అని, ఈ హత్యకు పాల్పడిన నేరస్తులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతోంది. చనిపోయిన వ్యక్తి సునీల్ రౌడీ షీటర్. ఈ దారుణ హత్యకు పాల్పడ్డ ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం సునిల్ సోదరుడిని రాహుల్, అజయ్, ముకేష్, మరికొంత మంది హత్య చేశారు. ఈ హత్యకు ప్రతీకారంగా సునీల్ ఒక కొడవలి తీసుకుని బయల్దేరాడు. బహిరంగ ప్రదేశంలో ఉన్న రాహుల్, అజయ్, ముకేష్లపై దాడి చేయబోయాడు.
ఇంతలో సునిల్ నుంచి కొడవలిని లాక్కున్నారు. రాహుల్, అజయ్, ముకేష్, ఇతరులు కలిసి కర్రలు, రాడ్లతో సునిల్ను విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి వచ్చి తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సునిల్ను ఆసుపత్రికి తరలించే ప్రతయ్నం చేశారు. అయితే ఆసుపత్రికి వెళ్లేలోపే మరణించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడ్డ నేరస్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.