Wife Murder: భార్య తల నరికి… తలతో పన్నెండు కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్‌లో..

భార్యపై అనుమానం ఉన్న 55ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో భార్యను కడతేర్చడమే కాకుండా.. ఆమె తలను నరికి దాంతో 12కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి పోలీస్ అవుట్ పోస్ట్ లో అప్పగించాడు.

Wife Murder: భార్య తల నరికి… తలతో పన్నెండు కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్‌లో..

unknown dead body

Updated On : July 22, 2022 / 3:30 PM IST

Wife Murder: భార్యపై అనుమానం ఉన్న 55ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో భార్యను కడతేర్చడమే కాకుండా.. ఆమె తలను నరికి దాంతో 12కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి పోలీస్ అవుట్ పోస్ట్ లో అప్పగించాడు.

నకఫోడి మఝీ అలియాస్ జాందా అనే నిందితుడు తన భార్య చంచలను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తరచూ వారిద్దరి మధ్య గొడవలయ్యేవని అలా జులై 15 గురువారం జరిగిన గొడవ అనంతరం పదునైన కత్తితో తలను నరికేశాడని వివరించారు. మరుసటి రోజు ఉదయమే గోండియా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ తలతో పోలీసులకు లొంగిపోయాడు.

నకఫోడిలో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయంతో వణికిపోయింది. తలను మాత్రమే తీసుకెళ్తుున్న అతణ్ని చూసి.. భయపడుతూనే తరముకుంటూ పోలీసులకు అప్పగించారు.

Read Also: పిల్లలు చూస్తుండగానే భార్యను హత్య చేసి ఉడికించిన భర్త

మఝీని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి.. రక్తపు మరకలు అంటిన ఆయుధాన్ని రికవరీ చేసుకున్నారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.