Pakistan: పిల్లలు చూస్తుండగానే భార్యను హత్య చేసి ఉడికించిన భర్త

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి ఆరుగురు పిల్లల ముందే తన భార్యను కాల్చి చంపి ఉడకబెట్టాడు. ఈ దారుణ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని వంటగదిలోని జ్యోతిలో నర్గీస్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

Pakistan: పిల్లలు చూస్తుండగానే భార్యను హత్య చేసి ఉడికించిన భర్త

unknown dead body

Updated On : July 14, 2022 / 9:28 PM IST

Pakistan: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి ఆరుగురు పిల్లల ముందే తన భార్యను కాల్చి చంపి ఉడకబెట్టాడు. ఈ దారుణ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని వంటగదిలోని జ్యోతిలో నర్గీస్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. హత్య చేసిన అనంతరం ముగ్గురు పిల్లలతో కలిసి పరారీ అవగా.. వారిలో ఒకరైన 15ఏళ్ల కూతురు పోలీసులకు సమాచారం ఇచ్చింది.

బజౌర్ ఏజెన్సీకి చెందిన మహిళ భర్త ఆషిక్ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. ప్రస్తుతం తొమ్మిది నెలలుగా మూతపడిన పాఠశాలలోనే ఓ గదిలో ఉంటున్నాడు. ఘటన తర్వాత ముగ్గురు పిల్లలు భయంతో వణికిపోయారని పోలీసులకు వెల్లడించారు.

ముందుగా మహిళను దిండుతో నొక్కి హత్య చేసిన అనంతరం పెద్ద గిన్నెలో వేసి ఉడికించాడు. మహిళ కాలు భాగాలను కూడా వేరు చేశాడు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలని బలవంతపెట్టి ఒప్పుకోకపోయేసరికి ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. నిందితుడ్ని అరెస్టు చేసే క్రమంలో పోలీసులు వెదుకుతున్నారు.

Read Also : అనుమానం పెనుభూతమై భార్య హత్య

ఇలాంటి ఘటనే.. సుమారు 11 ఏళ్ల క్రితం 2011 నవంబర్‌లో జరిగింది. ఒక మహిళ భర్త అనుమతి లేకుండా వేరొకరిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే భర్తను హత్య చేసి, అతని శరీర భాగాలను వండడానికి ప్రయత్నించింది.