Telangana : అనుమానం పెనుభూతమై భార్య హత్య

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. భర్త చేతిలో భార్య గౌతమి (18) హత్యకు గురైంది.

10TV Telugu News

Telangana : నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. భర్త చేతిలో భార్య గౌతమి (18) హత్యకు గురైంది. కుంటాల మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన నిఖిల్ కు భైంసా మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన గౌతమి‌తో ఈ ఏడాది జనవరి నెలలో వివాహం జరిగింది.

కొన్ని రోజులుగా భార్య ప్రవర్తపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా భార్యా భర్తలు గొడవ పడ్డారు. ఆవేశంలో భర్త భార్యను హత్య చేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. పోలీసులు వచ్చే సరికి నిఖిల్ పారిపోయాడు. గౌతమి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పరస్పర వివాదాలతో తన కుమార్తెను నిఖిల్ హత్య చేశాడని… నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరారు.

10TV Telugu News