Man Commits Suicide : నా చావుకు భార్యే కారణం-సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్న భర్త

గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో భార్య పుట్టింటికి వెళ్లి భర్తపై కేసు పెట్టింది. పోలీసులు స్టేషన్ కుపిలిచి విచారించే సరికి మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Man Commits Suicide : నా చావుకు భార్యే కారణం-సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్న భర్త

Man Commits Suicide

Updated On : June 9, 2021 / 5:37 PM IST

Man Commits Suicide : గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో భార్య పుట్టింటికి వెళ్లి భర్తపై కేసు పెట్టింది. పోలీసులు స్టేషన్ కుపిలిచి విచారించే సరికి మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

జిల్లాలోని రేపల్లె మండలం రొంపిచెర్లకు చెందిన ఏలికా రామకృష్ణారావు(32)కు, ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన గొర్రె భూలక్ష్మి తో గతేడాది వివాహం అయ్యింది. పెళ్లైన తర్వాత భార్య తరుచూ పుట్టింటికి వెళుతూ ఉండటంతో భార్య  ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇరువైపులా పెద్దలు ఎన్నిసార్లు సర్దిచెప్పినా వీరిమధ్య గొడవలు తగ్గలేదు.

దీంతో  భూలక్ష్మి భర్తను విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల భర్త, అతని బంధువులపై ఈపూరు పోలీసు స్టేషన్ లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం జూన్ 7న రామకృష్ణారావు, అతని  బంధువులను స్టేషన్‌కు పిలిపించి వివరాలు తీసుకున్నారు.

ఆ రాత్రి అందరూ ఇళ్లకు తిరిగి వెళ్లారు.  అందరూ నిద్రపోయిన తర్వాత… తన చావుకు భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణం అని సూసైడ్ నోట్ రాసి రామకృష్ణరావు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  ఉదయం నిద్రలేచిన బంధువులు అతను ఉరేసుకుని ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకున్న  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.