Man Cuts His Penis : ప్రపంచాన్ని రక్షించటానికి పురుషాంగాన్నికోసుకున్న ప్రబుధ్ధుడు

ప్రపంచాన్ని కాపాడేందుకు మనిషి తన పురుషాంగాన్ని కత్తిరించాలని రేడియోలో చెప్పారని... అమెరికాలోని ఓ ప్రబుద్ధుడు ఆ పని చేసాడు.

Man Cuts His Penis : ప్రపంచాన్ని రక్షించటానికి పురుషాంగాన్నికోసుకున్న ప్రబుధ్ధుడు

Man Cuts His Penis

Updated On : August 31, 2021 / 9:38 PM IST

Man Cuts His Penis : ప్రపంచాన్ని కాపాడేందుకు మనిషి తన పురుషాంగాన్ని కత్తిరించాలని రేడియోలో చెప్పారని… అమెరికాలోని ఓ ప్రబుద్ధుడు ఆ పని చేసాడు. యూఎస్ లోని టేనస్సీలో ఈదారుణం చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే…. టైసన్ గిల్‌బర్ట్ (39) టెన్నిస్సీలోని కుక్‌విల్లేలో నివసిస్తున్నాడు. పోలీసులు అతడిని వెంబడించినప్పుడు కారు నుండి తన పురుషాంగాన్ని కట్ చేసి రోడ్డు మీదకు విసిరేశాడు.

పోలీసులు తనను వెంబడిస్తున్న సమయంలో తన కారులోని రేడియోలో ప్రపంచాన్ని కాపాడటానికి పురుషాంగాన్ని కట్ చేయాలని న్యూస్ రావటంతో ఈ పని చేశానని చెప్పాడు. డోవెల్‌ టౌన్ నగరానికి సమీపంలో హైవే 70 లో ట్రాఫిక్‌లో  అతను పాక్షికంగా నిలబడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అతనిని వెంబడించడం ప్రారంభించారు.

టేనస్సీ హైవే పెట్రోల్ ట్రూపర్ బాబీ జాన్సన్,  WLJE రేడియో స్టేషన్‌తో మాట్లాడుతూ, అధికారులు మొదట లైట్‌తో   సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు అతను పారిపోయాడని చెప్పాడు. అధికారులు చివరికి డోవెల్‌టౌన్ నుండి లెబనాన్ వరకు రెండు కౌంటీలలో గిల్బర్ట్‌ను వెంబడించారు. ఇలా వెంబడిస్తున్న సమయంలో టైసన్ తన పురుషాంగాన్ని కోసి రోడ్డు మీదకు విసిరాడు.

జాన్సన్ తాను రోడ్డు మీద ఉన్నానని మరియు ఓల్డ్ లిబర్టీ రోడ్ వద్ద ఆగిపోయానని చెప్పాడు. అతను తన కారు తలుపు తెరిచినప్పుడు, అతను నగ్నంగా కనిపించాడు మరియు రక్తంతో నిండి ఉన్నాడని పోలీసులు తెలిపారు. అప్పుడు అతను తన కారు తలుపు మూసివేసి డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడని పోలీసులు తెలిపారు.

రక్తంతో తడిసిన గిల్బర్ట్ పశ్చిమ దిశగా విల్సన్ కౌంటీలోకి తన కారును పోనిచ్చాడు. చివరికి, చాలా ప్రయత్నం తర్వాత, గిల్బర్ట్ పట్టుబడ్డాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని…చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అధికారుల సమాచారం ప్రకారం, గిల్బర్ట్ తన పురుషాంగాన్ని తానే కోసుకున్నట్లు చెప్పాడు.  ఎందుకంటే రేడియో వాయిస్ ద్వారా అలా చేయమని ఆదేశించారు.  స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ప్రపంచాన్ని రక్షించడానికి మనిషి తన పురుషాంగాన్ని కత్తిరించాల్సిన అవసరం ఉందని రేడియోలో ని న్యూస్ లో చెప్పారని వివరించాయి. చికిత్స కోసం ఆ వ్యక్తిని సమీపంలోని వాండర్‌బిల్ట్ ఆసుపత్రికి తరలించారు.