Chennai : గుళ్లకు, ఆశ్రమాలకు వెళ్తోందని భార్యను చంపేశాడు, అనాథలైన చిన్నారులు
రోజు గుళ్లకు, ఆశ్రమాలకు వెళ్తోందని, ఇంట్లో పనులు పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో భార్యను కొట్టి చంపేశాడో ఓ భర్త.

Wife Murder
Man murders Wife : రోజు గుళ్లకు, ఆశ్రమాలకు వెళ్తోందని, ఇంట్లో పనులు పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో భార్యను కొట్టి చంపేశాడో ఓ భర్త. తీవ్ర రక్తస్రావం అవుతున్నా..అలాగే..సమీపంలోనే ఓ టెంపుల్ లోకి వెళ్లి కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా..అప్పటికే చనిపోయింది. దీంతో దాడికి పాల్పడిన భర్తను పోలీసులు అరెస్టు చేయగా..ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఆవడి సమీపంలోని తిరునిన్రవూర్ కు చెందిన చంద్రమోహన్ కు సెల్వి అనే మహిళతో 2011లో వివాహం జరిగింది.
Read More : MAA Elections : ఓటుకి రూ.25వేలు..! ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌పై సంచలన ఆరోపణలు
చంద్రమోహన్…ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. సెల్వి ఇంట్లోనే ఉండేది. వీరికి ఎనిమిది, ఐదు సంవత్సరాల పిల్లలున్నారు. అయితే..సెల్వీ తరచూ దేవాలయాలు, ఆశ్రమాలకు వెళ్లి వస్తుండడంతో..భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇంట్లో పనులు, పిల్లలను పట్టించుకోవడం లేదని భర్త వాగ్వాదానికి దిగుతుండేవాడు. శుక్రవారం రాత్రి సెల్వి విల్లుపురంలోని ఓ ఆశ్రమాన్ని సందర్శించుకుని ఇంటికి వచ్చింది. ఎప్పటిలాగానే వీరి మధ్య గొడవ జరిగింది.
Read More : Supreme Court : కరోనా మాత ఆలయం కూల్చివేతపై పిటిషన్ వేసిన వ్యక్తులకు రూ.5 వేలు జరిమానా
తీవ్ర ఆగ్రహంలో ఉన్న చంద్రమోహన్..కర్రతో ఆమె తలపై బలంగా బాదాడు. దీంతో సెల్వికి తీవ్ర రక్తస్రావమైంది. రక్తమోడుతున్నా..సమీపంలో ఉన్న దేవాలయంలోకి వెళ్లి కుప్పకూలిపోయింది. స్థానికులు గమనించి..చంద్రమోహన్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇతను…ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం…తిరువాల్కూర్ జీహెచ్ కు తరలించారు. అక్కడ శనివారం మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. వెంటనే Tirunindravur police stationకు వెళ్లి..లొంగిపోయాడు. అతడిని అరెస్టు చేసి..జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.