MAA Elections : ఓటుకి రూ.25వేలు..! ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌పై సంచలన ఆరోపణలు

ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ‘మా’ ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా, ఎన్నడూ లేని విధంగా ఈసా

MAA Elections : ఓటుకి రూ.25వేలు..! ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌పై సంచలన ఆరోపణలు

Maa Elections

MAA Elections : ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ‘మా’ ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా, ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ పరిశ్రమలో కాకరేపాయి. ఇండస్ట్రీని రెండు వర్గాలుగా విడిపోయింది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.

Manchu Vishnu: మేమే గెలుస్తున్నాం.. డిన్నర్ మీట్‌కి 500మంది వచ్చారు -మంచు విష్ణు

ఒక్కొక్కరికి రూ.25వేలు..
ఈ క్రమంలో.. ఎన్నికలకు కొన్ని గంటల ముందు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పై నరేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ వాళ్లు డబ్బులు పంచుతున్నారని నరేశ్ అన్నారు. మా సభ్యులను డబ్బుతో కొంటున్నారని, ఒక్కొక్కరికి రూ. 10వేల నుంచి రూ.25వేల వరకు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. మూడు నాలుగు సెంటర్లలో డబ్బులు పంచుతున్నారని చెప్పారు. మేనిఫెస్టో విడుదల చేయకుండా డబ్బుతో మా సభ్యులను లోబరుచుకుంటున్నారని నరేశ్ అన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఇచ్చే డబ్బులు తీసుకుని, ఓటు మాత్రం మనసాక్షిగా వేయాలని నరేశ్ పిలుపునిచ్చారు.

MAA Elections: నేను ప్రచారం ముగించి నాలుగు రోజులైంది.. అతనికి సిగ్గు లేదు -ప్రకాష్ రాజ్

మేము కాదు మీరే పంచుతున్నారు…
డబ్బులు పంచుతున్నారు అంటూ నరేశ్ చేసిన ఆరోపణలను శ్రీకాంత్ ఖండించారు. నరేష్ ఇంకా ఎందుకు అబద్ధాలు అడుతున్నారని అడిగారు. మేము డబ్బులు పంచుతున్నమా? అని నిలదీశారు. డబ్బులు పంచుతున్నది నరేశ్ అని, ఆయన చేస్తున్న పనిని తమ మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దసరా టైమ్ లో మేము తప్పు చేస్తే ఆ అమ్మవారే మమ్మల్ని శిక్షిస్తుందన్నారు.

ఇలాంటి కల్చర్ లెస్ పనులు మేము చెయ్యము అన్నారు. దయచేసి వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు శ్రీకాంత్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని నాశనం చెయ్యడానికే ఉన్నారా మీరందరూ అని శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని గంటల్లో ఎన్నికలు పెట్టుకొని డబ్బులు పంచుతున్నామని చెప్పడం దారుణం అన్నారు. డబ్బులు పంచుతున్నది మేము కాదు మీరు అని ఎదురుదాడికి దిగారు శ్రీకాంత్. నీ వల్లే అసోసియేషన్ డబ్బులు మొత్తం పోయాయని నరేశ్ పై ఫైర్ అయ్యారు శ్రీకాంత్. దయచేసి మా మెంబర్లు ఇలాంటి ప్రలోభాలకు లొంగొద్దని హీరో శ్రీకాంత్ కోరారు.