Minor Girl Rape : హైదరాబాద్‌లో మరో దారుణం.. బర్త్‌డే పేరుతో ఇంటికి పిలిచి మైనర్‌ బాలికపై బంధువు అత్యాచారం

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మాయమాటలతో నమ్మించి గొంతు కోస్తున్నారు. బయటి వారే కాదు బంధువులు కూడా కామంతో కాటేస్తున్నారు. హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. బంధువు అని నమ్మి వెళితే ఆ బాలిక జీవితం నాశనమైంది.

Minor Girl Rape : హైదరాబాద్‌లో మరో దారుణం.. బర్త్‌డే పేరుతో ఇంటికి పిలిచి మైనర్‌ బాలికపై బంధువు అత్యాచారం

Man Rapes Minor Girl In Hyderabad

Updated On : April 16, 2021 / 11:44 PM IST

Minor Girl Rape : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మాయమాటలతో నమ్మించి గొంతు కోస్తున్నారు. బయటి వారే కాదు బంధువులు కూడా కామంతో కాటేస్తున్నారు. హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. బంధువు అని నమ్మి వెళితే ఆ బాలిక జీవితం నాశనమైంది.

ఓ బాలికపై దూరపు బంధువైన ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. మూసాపేట జనతానగర్‌లో నివాసముంటున్న జై బాలు (25) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన బాలు.. ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం చూశాడు. మార్చి 17న తన పుట్టిన రోజు ఉందని బాలికను ఇంటికి పిలిపించుకున్నాడు. అతడిని నమ్మి వచ్చిన బాలిక మోసపోయింది. బాలికపై ఆ నీచుడు అత్యాచారం చేశాడు. అంతేకాదు అర్ధనగ్నంగా సెల్ఫీ కూడా తీసి తన స్నేహితులకు పోస్టు చేశాడు.

ఆ ఫొటో బాలిక బంధువులకు చేరటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఏప్రిల్ 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బలవంతంగా తనను అత్యాచారం చేసినట్లు బాలిక ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయం తెలిసిన బాలు పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.