లాక్ డౌన్ లో ఘోరం, భార్య చెల్లిపై భర్త అఘాయిత్యం
బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. ఆడపిల్లకు ఇంటి బయటే కాదు ఇంట్లోనూ రక్షణ కరువైంది.

బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. ఆడపిల్లకు ఇంటి బయటే కాదు ఇంట్లోనూ రక్షణ కరువైంది.
బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. ఆడపిల్లకు ఇంటి బయటే కాదు ఇంట్లోనూ రక్షణ కరువైంది. రక్షణగా ఉండాల్సిన వారే కామంతో కాటేస్తున్నారు. అత్యాచారాలకు తెగబడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా అక్క ఇంట్లో చిక్కుకున్న ఓ చెల్లిపై అక్క భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను అత్యాచారం చేశాడు. భర్తకు బుద్ధి చెప్పాల్సిన ఆ భార్య, అతడిని వెనకేసుకొచ్చింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని చెల్లిని భయపెట్టింది.
పశ్చిమ బెంగాల్‌లో ఈ దారుణం జరిగింది. లాక్ డౌన్ కారణంగా తన ఇంట్లో ఆశ్రయం పొందుతున్న భార్య సోదరిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. అయితే చెల్లికి అండగా నిలవాల్సిన అక్క కూడా భర్తకే మద్దతు పలికింది. ఈ విషయం బయటపడితే పోలీసులు తన భర్తను అరెస్ట్ చేస్తారన్న భయంతో తన భర్త చెప్పినట్లే నడుచుకోమని చెల్లిని మందలించింది.
పెయింటింగ్ పనులు చేసే దత్తు అనే వ్యక్తి భార్య జమునతో కలిసి పురులియా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఏప్రిల్ లో వీరి ఇంటికి జమున సోదరి మయూరి పనిమీద వచ్చింది. లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయింది. మయూరిపై కన్నేసిన దత్తు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.
ఈ విషయం తెలుసుకున్న భార్య జమున సోదరికి అండగా నిలవాల్సింది పోయి భర్తకు వత్తాసు పలికింది. అయితే బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో అసలు సంగతి బయట పడింది. యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Also Read | లాక్ డౌన్‌లోనూ ఆగని అత్యాచారాలు, యువతిపై గ్యాంగ్‌రేప్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు