Maoist Leader : మావోయిస్టు అగ్రనేత కన్నుమూత
మావోయిస్ట అగ్రనేత కత్తి మోహన్ రావు,(అలియాస్ ప్రకాశన్న, దామదాద) గుండెపోటుతో మరణించినట్లు మావోయస్టు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

Maoist Leader
Maoist Leader : మావోయిస్టు అగ్రనేత కత్తి మోహన్ రావు (అలియాస్ ప్రకాశన్న, దామదాద) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అస్వస్ధతులుగా ఉన్నారు. జూన్ 10న ఉదయం గం.11-20 నిమిషాలకు గుండెపోటుతో మరణించారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కోన్నారు. మోహనరావు మృతి పట్ల పార్టీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసింది. మోహనరావు స్వస్ధలం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామం. 39 ఏండ్ల క్రితమే ఆయన అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది.
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోహన్ రావు చదువులో చురుకైన వాడు. ఇంటర్ మహబూబాబాద్, డిగ్రీ ఖమ్మం, పీజీ కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. డబుల్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఆయనకు అన్న, అక్క, తమ్ముడు, చెల్లె ఉన్నారు. ఉద్యమంలో చేరిన తర్వాత 1985లో ఆయన ఖమ్మంలో అరెస్ట్ అయ్యారు. ఆరేళ్లు జైలు జీవితం గడిపారు. విడుదలై బయటకు వచ్చిన ఆయన మళ్లీ మవోయిస్టు ఉద్యమంలో కొనసాగారు. అప్పటి నుంచి అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. దండకారణ్యంలో విప్లవ పాఠాలు బోధిస్తున్నారు.
మోహనరావు మృతి మవోయిస్టులకు తీరని లోటని… ఆయన భౌతిక కాయాన్నికుటుంబ సభ్యులకు అందించలేకపోయినందుకు చింతిస్తున్నామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది.