Maoist Top Leader Died : కరోనా సోకి మావోయిస్టు అగ్రనేత మృతి

మావోయిస్టు పార్టీ అగ్రనేత యాపానారాయణ @ హరిభూషన్ కి కరోనా సోకింది. చికిత్స తీసుకునే క్రమంలో గుండె పోటుతో మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.

Maoist Top Leader Died : కరోనా సోకి మావోయిస్టు అగ్రనేత మృతి

Maoist Haribhushan Died

Updated On : June 23, 2021 / 1:26 PM IST

Maoist Top Leader Died : మావోయిస్టు పార్టీ అగ్రనేత యాపానారాయణ @ హరిభూషన్ కి కరోనా సోకింది. చికిత్స తీసుకునే క్రమంలో గుండె పోటుతో మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.

ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ…పార్టీలో కీలక నేతలుగా ఉన్నపూల దేవేందర్ రెడ్డి, దామోదర్ లకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో బెటాలియన్ సభ్యులుగా ఉన్న నందు, సోను, వెంకట్, శారద, అరుణ, నడుమ ఇంకా మావోయిస్టు సీసీ మెంబెర్స్ తదితరులకు కరోనా సోకిందని ఎస్పీ తెలిపారు.

కరోనా వచ్చిన మావోయిస్టులు స్వచ్చందంగా లొంగిపోతే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కరోనా ఉండడంతో గిరిజనులతో పెద్ద ఎత్తున సమూహాలు ఏర్పాటు చేయవద్దని, దాని వల్ల వారికికూడా కరోనా సోకుతుంది అని ఎస్పీ మావోయిస్టులకు సూచించారు.