మావోయిస్టుల ఘాతుకం : తెలంగాణ ఆర్టీసీ బస్సుకు నిప్పు
తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరులో మావోయిస్టులు రెచ్చిపోయారు.

తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరులో మావోయిస్టులు రెచ్చిపోయారు.
తూర్పుగోదావరి : జిల్లాలోని చింతూరులో మావోయిస్టులు రెచ్చిపోయారు. ప్రయాణికులను కిందకుదింపి తెలంగాణ ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు. బస్సు పాక్షికంగా కాలిపోయింది. వివరాళ్లోకి వెళ్తే.. తెలంగాణలోని తాండూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు చత్తీస్ ఘడ్ లోని కుంట నుంచి మెదక్ జిల్లాలోని తాండూరుకు వస్తోంది. మార్గంమధ్యలో తూర్పుగోదావరి జిల్లా చింతూరులో బొడ్డుగూడెం సమీపంలో జాతీయ రహదారిపై మావోయిస్టులు చెట్లు నరికివేసి బస్సును ఆపారు. ప్రయాణికులను దింపివేసిన తర్వాత బస్సును తగలబెట్టారు. లారీని కూడా తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఈఘటనలో వంద మంది సాయుధ మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు అధిక సంఖ్యలో ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.