Delhi Oyo: ఓయో గదిలో వాగ్వాదం.. ప్రియురాలిని కాల్చి చంపిన ప్రియుడు

ప్రవీన్‭పై గతంలో కూడా మర్డర్ కేసులు ఉన్నాయి. గౌరవ్ అనే వ్యక్తిని కాల్చి చంపిన ఆరోపణతో సెప్టెంబర్ 21న అతడిపై ఒక మర్డర్ కేసు నమోదు అయింది. బాధితుడి తండ్రి ప్రవీన్‭పై కేసు నమోదు చేశాడు. అయితే కొద్ది రోజుల్లోనే ప్రవీన్ బెయిల్‭పై బయటికి వచ్చాడు. ఇక తాజా సంఘటన తీవ్ర భయాందోళనలకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు

Delhi Oyo: ఓయో గదిలో వాగ్వాదం.. ప్రియురాలిని కాల్చి చంపిన ప్రియుడు

Married man shoots girlfriend in Delhi Oyo after argument

Updated On : November 23, 2022 / 5:02 PM IST

Delhi Oyo: తీవ్ర వాగ్వాదం అనంతరం ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపాడు ఓ వ్యక్తి. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఉన్న ఓయో హోటల్ గదిలో జరిగిన దారునం ఇది. నిందితుడి పేరు ప్రవీన్ అలియాస్ సీతు (38). బాదితురాలి పేరు గీత (39). ప్రియురాలిని హతమార్చిన అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకుని చనిపోయే ప్రయత్నం చేశాడు. బుల్లెట్ అతడిని తలపై తగిలింది. కానీ, అదృష్టవశాత్తూ బతికి బయట పడ్డాడు. ప్రస్తుతం ఢిల్లీలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

హోటల్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీన్, గీత మంగళవారం హోటల్ గదికి వచ్చారు. కాసేపటికి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. చాలాసేపు వాదులాడుకున్నారు. ఈ వాగ్వాదంతో తీవ్ర ఉద్వేగానికి లోనైన ప్రవీన్.. తన వద్ద ఉన్న తుపాకీ తీసి గీతను చాతిలో కాల్చాడు. దీంతో గీత అక్కడికక్కడే కుప్ప కూలి పోయింది. అనంతరం తాను తలపై కాల్చుకున్నాడు. ఈ శబ్దాలు విని హోటల్‭లోని వర్కర్లు పరుగు పరుగున వెళ్లగా.. ఇద్దరూ రక్తపు మడుగులో ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించి వారిని ఆసుపత్రికి తరలించారు.

ప్రవీన్‭పై గతంలో కూడా మర్డర్ కేసులు ఉన్నాయి. గౌరవ్ అనే వ్యక్తిని కాల్చి చంపిన ఆరోపణతో సెప్టెంబర్ 21న అతడిపై ఒక మర్డర్ కేసు నమోదు అయింది. బాధితుడి తండ్రి ప్రవీన్‭పై కేసు నమోదు చేశాడు. అయితే కొద్ది రోజుల్లోనే ప్రవీన్ బెయిల్‭పై బయటికి వచ్చాడు. ఇక తాజా సంఘటన తీవ్ర భయాందోళనలకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గీతను ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రవీణ్‌కు సుశీల అనే భార్య, పిల్లలు ఉన్నారు. వీరు గ్రామంలో ఉంటున్నారు.

Three siblings: రైలు వస్తుందన్న భయంతో బ్రిడ్జి పైనుంచి దూకేసిన ముగ్గురు తోబుట్టువులు.. ఒకరి మృతి