కాపురం కూల్చిన సోషల్ మీడియా : ఫేస్ బుక్ ఫ్రెండ్ తో లేచిపోయిన భార్య

సోషల్ మీడియాలో ఏర్పడ్డ స్నేహాల కారణంగా ఇటీవలి కాలంలో కాపురాలు కూలిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లలో ఉండే చాటింగ్ యాప్ ల ద్వారానూ, వీడియో కాలింగ్ ల ద్వారా, ఫేస్ బుక్, వాట్సప్ ల ద్వారా ఎక్కడెక్కడి వాళ్లతోనో పరిచయాలు ఏర్పడి వాటి మూలంగా కూలిపోతున్న కాపురాలు లెక్కలేనన్ని ఉంటున్నాయి.
రోజు వార్తల్లో ఇలాంటివి చూస్తూ కూడా కట్టుకున్న మొగుడ్ని, పెళ్లాన్ని వదిలేసి సోషల్ మీడియాలో పరిచయం అయిన వాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుని లేచిపోతున్న వాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో ఒక వివాహిత, భర్తను వదిలేసి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తితో వెళ్లి పోవటం తీవ్ర సంచలనం కలిగించింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా, తాండూర్ మండలం, కొత్లాపూర్ కు చెందిన విక్రమ్ గౌడ్ అదే గ్రామానికి చెందిన అనితను తొమ్మిదేళ్ల క్రితం పెళ్ళి చేసుకున్నాడు. వీరికి సంతానం కలగలేదు. అనితకు కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో అలీ ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఎక్కువ సేవు అనిత అతడితో ఫేస బుక్ లో చాటింగ్ చేసేది.ఈ క్రమంలో వారిద్దరూ ఫోన్ నెంబర్లు తెలుసుకుని ఫోన్ లో మాట్లాడుకునే దాకా వెళ్లారు
మే 26 వ తేదీన అనిత ఇంటి నుంచి బయటకు వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదు. భార్య ఆచూకి కోసం తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద గాలించినా విక్రమ్ గౌడ్ కు ఫలితం కనిపించలేదు. దీంతో తన భార్య ఫేసు బుక్ ద్వారా పరిచయం అయిన ఫ్రెండ్ తోనే వెళ్లిపోయి ఉంటుందని అనుమానించాడు. అతని వివరాలు తెలుసుకునేందుకు ఫేస్ బుక్ ప్రోఫైల్ చెక్ చేయగా ఆ అకౌంట్ క్లోజ చేసినట్లు వచ్చింది.
దీంతో అతని అనుమానం మరింత బలపడటంతో గురువారం తాండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలీ ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తి తన భార్యను ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని, ట్రాప్ చేసి తీసుకు వెళ్లి పోయాడని ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read: పెద్దలకు తెలియకుండా పెళ్లి…మరో పెళ్లి ఖాయం అయ్యేసరికి సూసైడ్