ఉప్పల్‌ సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

భారీగా మంటలు ఎగిసిపడటంతో షాపింగ్ మాల్ కు వచ్చిన కస్టమర్లు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఉప్పల్‌ సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident In CMR Shopping Mall

Updated On : January 3, 2024 / 12:42 AM IST

Fire In CMR : హైదరాబాద్ ఉప్పల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సీఎంఆర్ షాపింగ్ మాల్ లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. భారీగా మంటలు ఎగిసిపడటంతో షాపింగ్ మాల్ కు వచ్చిన కస్టమర్లు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలిసే లోపే మంటలు పూర్తిగా వ్యాపించేశాయి.

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే షాపింగ్ మాల్ లోని సిబ్బంది అంతా బయటకు వచ్చేశారు. రాత్రి 9గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. తొలుత చిన్నగా మొదలైన మంటలు చూస్తుండగానే మాల్ మొత్తం వ్యాపించాయని, అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని సిబ్బంది చెప్పారు.

Also Read : 8మంది సిట్టింగ్‌లకు జగన్ షాక్, 11మంది కొత్తవాళ్లకు, ఐదుగురు వారసులకు అవకాశం.. వైసీసీ సెకండ్ లిస్ట్ విడుదల

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. వరంగల్ జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్ మెయిన్ రోడ్ మీదే షాపింగ్ మాల్ ఉంది. అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాకే ఎంత మొత్తంలో ప్రమాదం జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది? అనే వివరాలు తెలుస్తాయన్నారు.

కాగా.. షాపింగ్ మాల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. మాల్ క్లోజ్ చేసే సమయంలో ప్రమాదం జరగ్గా, ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరూ మాల్ లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందంటున్నారు.