Fire Accident : ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం, 21మంది దుర్మరణం
Fire Accident: చైనా రాజధాని బీజింగ్ లోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

Fire Accident (Photo : Google)
Fire Accident : చైనా రాజధాని బీజింగ్ లోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది ప్రాణభయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది.
అగ్నిప్రమాదం, తొక్కిసలాట కారణంగా మొత్తం 21మంది చనిపోయారు. మరికొంతమంది ఆసుపత్రి నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న 71మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు.