Massive Robbery : నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ.. ప్రయాణికుల నుంచి నగదు, బంగారం అపహరణ

విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.

Massive Robbery : నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ.. ప్రయాణికుల నుంచి నగదు, బంగారం అపహరణ

Massive robbery

Massive Robbery : రైల్వే డిపార్ట్ మెంట్ రైళ్ల భద్రతను ఎంత కట్టుదిట్టం చేసినప్పటికీ రైలులో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది. షిరిడి నుంచి నర్సాపూర్ కు వెళ్తున్న నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికుల నుంచి నగదు, బంగారం, సెల్ ఫోన్ తోపాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.

Tirupur Theft : చెన్నై-ముంబై రైలులో ఛేజింగ్ సీన్:నాగపూర్ లో దొంగలు పట్టివేత

ఈ ఘటన మహారాష్ట్ర పర్భాని జంక్షన్ లో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.