Abortions In Private Hospital : నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్న హాస్పిటల్..ఆడపిల్లలు వద్దనుకునేవారికి గుట్టుచప్పుడు కాకుండా
సిద్దిపేటలో నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. భరత్‌నగర్‌లో ఎలాంటి బోర్డు లేకుండా.. ప్రత్యేకంగా అబార్షన్ల కోసమే న్యూలైఫ్ అనే ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆడపిల్లలు వద్దనుకునే వారికి.. గుట్టుచప్పుడు కాకుండా ఈ ఆస్పత్రిలో అబార్షన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

abortions in Private Hospital
abortions in Private Hospital : సిద్దిపేటలో నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. భరత్‌నగర్‌లో ఎలాంటి బోర్డు లేకుండా.. ప్రత్యేకంగా అబార్షన్ల కోసమే న్యూలైఫ్ అనే ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆడపిల్లలు వద్దనుకునే వారికి.. గుట్టుచప్పుడు కాకుండా ఈ ఆస్పత్రిలో అబార్షన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆస్పత్రికి వచ్చేవారి కళ్లకు గంతలు కట్టి.. ఎలాంటి అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. వైద్యాధికారులు, పోలీసులు రైడ్ చేశారు. హాస్పిటల్ సీజ్ చేసి.. పేషెంట్లను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Abortions: మగబిడ్డ కోసం 8 అబార్షన్లు.. 1500 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించిన భర్త
హాస్పిటల్‌లో గైనకాలజిస్ట్ ఎవరు లేరని.. ఆయుర్వేదానికి సంబంధించిన డాక్టరేట్ పొందిన ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా జిల్లా కేంద్రంలోనే ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.