Bank Account:వారి మాయలో పడితే బ్యాంక్ ఖాతా ఖాళీ

ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. అమాయకులను నమ్మించి బ్యాంకు OTPలను సైబర్ ఫ్రాడ్స్ దొంగిలించి వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును దోచేస్తున్నారు.  డెబిట్‌ కార్డు ద్వారా కొత్త సదు

Bank Account:వారి మాయలో పడితే బ్యాంక్ ఖాతా ఖాళీ

Money Stolen Bank Account

Updated On : March 8, 2022 / 11:07 AM IST

Bank Account:ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. అమాయకులను నమ్మించి బ్యాంకు OTPలను సైబర్ ఫ్రాడ్స్ దొంగిలించి వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును దోచేస్తున్నారు.
డెబిట్‌ కార్డు ద్వారా కొత్త సదుపాయాలు కల్పిస్తున్నామని బ్యాంకు అధికారుల్లా మాటల్లో దించుతారు.. ఫోనులో తియ్యగా మాట్లాడతారు.. చివరికి కార్డు వివరాలు తెలుసుకుని
రూ.వేలకువేలు స్వాహా చేస్తారు. గత కొన్ని రోజులుగా దిల్లీ.. నోయిడా.. జాంతారా కేంద్రాలుగా సైబర్‌ నేరస్థులు ఒన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ మోసాలకు తెరలేపారు. వారి మాయలో పడి డబ్బులు పోగొట్టుకోవద్దంటూ పోలీస్‌ అధికారులు బ్యాంకు ఖాతాదారులను హెచ్చరిస్తున్నారు. కొత్త డెబిట్‌కార్డులు.. మైక్రో చిప్పుల పేరిట ATM కార్డుల నంబర్లు, పాస్‌వర్డ్‌లు తీసుకుంటున్నారు.

సైబర్‌ నేరస్థులను గుర్తించి వారిని జైలుకు పంపించడంతో పాటు వారిపై PD చట్టం ప్రయోగిస్తున్నా..OTP మోసాలు నియంత్రణలోకి రావడం లేదు. గతేడాది 3449 మంది ఫిర్యాదు చేయగా.. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలో 261 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి స్వాహా చేస్తున్న సొమ్మును నేరగాళ్ల ఖాతాల్లోకి పంపించకుండా చర్యలు చేపట్టాలని బ్యాంకుల యజమానులు, ఈ-వ్యాలెట్‌ నిర్వాహకులను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కోరుతున్నారు.

సైబర్‌ నేరస్థులు నాలుగైదేళ్ల నుంచి ATM కార్డుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ముంబయి, దిల్లీ, నోయిడాల్లో పొరుగుసేవల నుంచి ఫోన్ నంబర్లను తీసుకుంటున్నారు. SBI, ICICI, HDFC, AXIS తదితర బ్యాంకుల ఖాతాదారుల వివరాలను దొడ్డి దారిన తీసుకుంటున్నారు. 4,5 రోజులు ఈ జాబితాను పరిశీలించాక.. కార్డు దారుల పేర్లు, చిరునామా, వయస్సు ఆధారంగా బ్యాంకు అధికారులు మాట్లాడినట్టే అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. డెబిట్‌ కార్డు దారులు స్పందించిన వెంటనే వారి OTPలు తీసుకుని వారి ఖాతాల్లో నగదు దోచుకుంటున్నారు. సొమ్ము పోగొట్టుకున్న వారు బ్యాంకులకు వెళ్లి సంప్రదించేలోపు ఖాతాల్లో నగదును ఈ-వ్యాలెట్‌లలోకి తరలిస్తున్నారు. వీటిలో జమచేసుకుంటే పోలీసులకూ అనుమానం రాదని ఈ మోసానికి తెరలేపారు.