Maoist Leader Rihno Arrest : మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత రైనో అరెస్టు.. మాజీ ఎమ్మెల్యేల హత్య కేసులో ప్రధాన నిందితుడు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు నేత శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో రైనో పోలీసులకు పట్టుబడ్డాడు.

Maoist Leader Rihno Arrest : మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత రైనో అరెస్టు.. మాజీ ఎమ్మెల్యేల హత్య కేసులో ప్రధాన నిందితుడు

MAOIST

Updated On : February 22, 2023 / 11:36 PM IST

Maoist Leader Rihno Arrest : అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు నేత శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో రైనో పోలీసులకు పట్టుబడ్డాడు. రైనో నుంచి ఐఈడీ, తుపాకీ, పేలుడు సామాగ్రి, విప్లవ సాహిత్యం, నగదు, ఇతర సామాగ్రిలను స్వాధీనం చేసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, తివేరి సోమలే హత్య కేసులో రైనో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. 2018 సెప్టెంబర్ 23న మాజీ ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే తివేరి సోమలేని హత్య గావించడ్డారు. రైనో పై గతంలో ప్రభుత్వం రూ.5లక్షల రివార్డ్ ను కూడా ప్రకటించింది.

Rewards On Maoist Leaders : మావోయిస్టు కీలక నేతలపై రివార్డులు ప్రకటన

ఏవోబీ ప్రత్యేక జోన్ డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఏవోబీలో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో రైనో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్నాడు.