Prostitution Racket Busted In Gwalior : పాల వ్యాపారం మాటున వ్యభిచారం

మధ్య‌ప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. గ్వాలియర్ లోని మురార్ ప్రాంతంలోని జాడేరు డామ్ సమీపంలోని ప్రీతమ్ మహుర్ అనే వ్యక్తి ఇంట్లో  పాల వ్యాపారం మాటున  వ్యభిచారం జర

Prostitution Racket Busted In Gwalior : పాల వ్యాపారం మాటున వ్యభిచారం

Prostitution Rakcet Busted

Updated On : October 29, 2021 / 9:42 AM IST

Prostitution Racket Busted In Gwalior :  మధ్య‌ప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. గ్వాలియర్ లోని మురార్ ప్రాంతంలోని జాడేరు డామ్ సమీపంలోని ప్రీతమ్ మహుర్ అనే వ్యక్తి ఇంట్లో  పాల వ్యాపారం మాటున  వ్యభిచారం జరుగుతోందనే సమాచారం పోలీసులకు అందింది. ఇంటిపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం రాత్రి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో పాటు 10 మంది విటులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుుకున్నారు.

మహుర్ తన భార్య గీత ద్వారా పాల వ్యాపారం చేయిస్తున్నాడు. పాల వ్యాపారం మాటున వ్యభిచారం  నిర్వహిస్తున్నారనే పక్కా సమచారం అందటంతో… ఒక పోలీసు సివిల్ డ్రస్ లో విటుడిగా ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ యువతిని బుక్ చేసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఒక్కసారిగా పోలీసులు దాడి చేశారు.

Also Read : Tirumala Break Darshan : తిరుమలలో 4వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ఒకగదిలో ఇద్దరు యువతులు ముగ్గురు పురుషులు అభ్యంతరకర పరిస్దితిలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. మరోక గదిలో మహుర్ భార్య గీతామహుర్ మరో ఏడుగురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్ధలంలో ఉన్న నగదు, ఇతర సామాగ్రిని పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. గత రెండేళ్లుగా ఈసెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది.

పాల వ్యాపారం నిర్వహిస్తుండటంతో మొదట ఎవరికీ అనుమానం రాలేదు.  కానీ ఇంటికి రాన్రాను  ఎక్కువ మంది   మనుషులు  వచ్చి వెళుతూ ఉండటంతో  చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.  గీతా మహుర్ కస్టమర్లలో 19నుండి60సంవత్సరాల వారు కూడా ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. గీత వద్దకు గ్వాలియర్ నుంచే కాక భింద్-మోరెనా జిల్లా నుండి కస్టమర్లు వస్తుంటారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.