ఇంటిముందు చెత్తవేస్తే చంపేస్తా… అని బెదిరించటంతో ఆత్మహత్య చేసుకున్న బాలిక

ఇంటి ముందు చెత్తవేశావంటే చంపేస్తానని పక్కింటామె బెదిరంచటంతో ముంబైలో 11 ఏళ్ళ బాలిక భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఇంటిముందు చెత్తవేస్తే చంపేస్తా… అని బెదిరించటంతో ఆత్మహత్య చేసుకున్న బాలిక

Updated On : March 10, 2021 / 6:54 PM IST

Mumbai : 11 year old girl dies by suicide after argument with neighbour over throwing garbage issue : ఇంటి ముందు చెత్తవేశావంటే చంపేస్తానని పక్కింటామె బెదిరంచటంతో ముంబైలో 11 ఏళ్ళ బాలిక భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ముంబైలోని మన్ ఖర్దు ప్రాంతంలోని భీమ్ నగర్ లో నివసించే 11 ఏళ్ల బాలిక మార్చి 6వ తేదీన… తన ఇంట్లోని చెత్త బయట పారవేసే క్రమంలో అది పక్కింటి వాళ్ల గుమ్మం ముందు పడింది. దీంతో పక్కింటి మహిళ ఆ బాలికతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో పక్కింటామెతో బాలిక, బాలిక తల్లికి ఘర్షణ జరిగింది.

ఈ గొడవలో ..మా ఇంటిముందు చెత్త వేస్తే  చంపేస్తానని పక్కింటి మహిళ బాలికను బెదిరించింది. దీంతో బాలిక భయపడి ఏడుపు లంకించుకుంది.  ఆ సమయంలో ఇదంతా చూస్తున్న పొరుగింట్లో ఉండే వ్యక్తి వచ్చి వారిమధ్య సయోధ్య కుదిర్చి గొడవ సర్దుమణిగేలా చేశాడు. అనంతరం ఎవరింట్లోకి వాళ్లు వెళ్ళిపోయారు.

ఆ రోజు మధ్యాహ్నం  బాలిక తల్లి వేరే బంధువుల ఇంటికి భోజనానికి వెళ్ళింది.  ఆ సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉదయం జరిగిన ఘర్షణకు భయపడిన బాలిక ఇంట్లో ఆత్మహత్యాయత్నం  చేసింది.  బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక తల్లికి అరగంటలో ఆమెకు వేరే వారిద్వారా సమాచారం వచ్చింది.

పరుగున ఇంటికి వచ్చిన ఆమె తన కుమార్తెను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. ఈలోగా ఆమె భర్తకు సమాచారం ఇచ్చింది.  ఆస్పత్రిలో వైద్యులు బాలికను పరీక్షించి అప్పటికే బాలిక మరణించినట్లు చెప్పారు. దీంతో బాలిక తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పొరుగింటి మహిళ చంపేస్తానని బెదిరించటం వల్లే తమ కుమార్తె భయపడి ఆత్మహత్య  చేసుకుందని వారు  ఆరోపించారు. పొరుగింటి ఆమె బెదిరిస్తుండగా ఇరుగు పొరుగు వారు చూశారని ఆమె తన ఫిర్యాదులో వివరించింది.  పొరుగింటి మహిళపై   ఐపీసీ సెక్షన్ 305, 504, 506 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.