Kidnap Case : శంకరయ్య కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు…ఎక్కడ దొరికాడంటే…..
దుబాయ్ నుంచి ఇండియా వచ్చి ముంబై విమనాశ్రయం బయట కిడ్నాప్ కు గురైన తెలంగాణకు చెందిన శంకరయ్య కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది.

Jagital Shankaraiah Kidnap Case
Kidnap Case : దుబాయ్ నుంచి ఇండియా వచ్చి ముంబై విమనాశ్రయం బయట కిడ్నాప్ కు గురైన తెలంగాణకు చెందిన శంకరయ్య కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది. కిడ్నాపర్ల చెర నుంచి శంకరయ్యను రక్షించిన ముంబై పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. శంకరయ్యను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన శంకరయ్య ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. దుబాయ్ నుంచి గత నెల 22న ముంబై తిరిగివచ్చి అక్కడి నుంచి స్వగ్రామం రావటానికి ట్యాక్సీ ఎక్కే సమయంలో గుర్తు తెలియని దుండగులు శంకరయ్యను అపహరించుకుని పోయారు. రెండు రోజులకు అతని కుమారుడి ఫోన్ కు ఇంటర్నెట్ కాల్ చేసి శంకరయ్యను కిడ్నాప్ చేశామని డబ్బులు డిమాండ్ చేశారు.
మళ్లీ రెండు రోజులకు శంకరయ్యను బంధించిన ఫోటో పంపించి డబ్బులు డిమాండ్ చేశారు. వారు కోరిన డబ్బు సమ కూర్చలేని శంకరయ్య కుటుంబ సభ్యులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసారు. పోలీసులు దాదాపు వారం రోజుల పాటు గాలించి శంకరయ్య ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని ఒక స్ధావరంలో బందీగా ఉన్నట్లు గుర్తించారు.
స్ధానిక పోలీసుల సహాయంతో శంకరయ్యను శనివారం రాత్రి విడిపించారు. కిడ్నాపర్ల చేతిలో బందీగా ఉన్న శంకరయ్య అస్వస్ధతకు గురవ్వటంతో అతడిని చెన్నై నుంచి ముంబైకి విమానంలో తరలించి ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా శంకరయ్యను కిడ్నాపర్లు ఎందుకు కిడ్నాప్ చేసారనే అంశంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అతడిని బంగారం అక్రమ రవాణాకు వాడుకున్నారా….ఆయన వద్ద ఉన్న డబ్బులు బంగారం దోచుకునేందుకు కిడ్నాప్ చేశారా… మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసుల విచారణ చేపట్టారు.
Also Read : YSRCP Plenary : జులై 8,9ల్లో వైసీపీ రాష్ట్ర స్ధాయి ప్లీనరీ సమావేశాలు