హత్య చేసి శవంతో సెల్ఫీ : గంజాయి మత్తులో యువకుడి కిరాతకం
చెన్నైలో వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. గంజాయి మత్తులో ఓ యువకుడిని హత్య చేసి, శవంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ లో పెట్టాడు.

చెన్నైలో వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. గంజాయి మత్తులో ఓ యువకుడిని హత్య చేసి, శవంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ లో పెట్టాడు.
తమిళనాడు : చెన్నైలో వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. గంజాయి మత్తులో ఓ యువకుడిని హత్య చేసి, శవంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ లో పెట్టాడు. చెన్నై పరంగిమలై ఆదంబాక్కం పోలీస్ స్టేషన్ వెనుకవైపు ఆర్మీ క్వార్టర్స్ లో వినియోగంలో లేని బహిరంగ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రహరీ గోడలు నిర్మించి ఆర్మీ పర్యవేక్షిస్తోంది. రెండు రోజుల క్రితం ముగ్గురు యువకులు గంజాయి పేవించేందుకు అక్కడికి వెళ్లారు. కొద్ది సేపటికి బయటకు ఇద్దరు వ్యక్తులే వెళ్లడాన్ని గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.
Read Also : ఎఫ్-16ను భారత్ కూల్చివేయలేదు : అమెరికా మేగజైన్ కథనం
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డైన దృశ్యాలను పరిశీలించి, తనిఖీ చేయగా ఓ చోట మట్టి తవ్వి ఉండటాన్ని గమనిచారు. ఆ మట్టిని తొలగించి చూడగా ఒక యువకుడి శవం తీవ్ర గాయాలతో ముఖం చిద్రమైన స్థితిలో ఉంది. శవాన్ని పంచనామా చేసి, విచారణ చేపట్టగా ఆ ముగ్గురు యువకుల్లోని ఒకరు కలైంజర్ నగర్ కు చెందిన ఆనంద్ గా గుర్తించారు. అతడు అజ్ఞాతంలోకి వెళ్లగా అతడి స్నేహితుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆనంద్ గంజాయి మత్తులో ఒక యువకుడిని చంపి, అతని శవంతో సెల్ఫీ దిగి వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టడాని స్థానికులు తెలిపారు. నిందితుడు ఆనంద్, అతడి పక్కనే ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Read Also : నేడు ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ విరామం