Murder in Gunturu District : హత్య చేసి, చేయి నరికి తీసుకువెళుతున్న నిందితుడు

Murder In Guntur District
Murder in Gunturu District : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని హత్య చేసిన నిందితుడు అతని చేయి నరికి సంచిలో పెట్టి తీసుకువెళుతున్నాడు. పోలీసు తనిఖీల్లో ఈవిషయం బయటపడేసరిక పోలీసులు ఖంగుతిన్నారు.
జిల్లాలోని పెదకాకాని మండలం రామచంద్రపురంలో నిందితుడు ఒక యువకుడిని హత్య చేశాడు. అనంతరం యువకుడి చేతిని నరికి సంచిలో పెట్టుకుని వెళ్తున్నాడు. కాగా నల్లపాడు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సంచిలో చేయి బయటపడింది.
ఖంగుతిన్న పోలీసులు వెంటనే నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నిందితుడు ఇచ్చిన వివరాలతో ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాంతో చేతిని సరిపోల్చుకున్నారు. హతుడు ఎవరు ? నిందితుడికి హతుడికి వైరం ఏమిటి ? మొదలైన వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.