Muthireddy Yadagiri Reddy : ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాక్ ఇచ్చిన కూతురు
Muthireddy Yadagiri Reddy : ఇదివరకే ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూతురి ఫిర్యాదుతో మరోసారి భూవివాదం తెరపైకి వచ్చింది.

Muthireddy Yadagiri Reddy
Muthireddy Yadagiri Reddy : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కన్నకూతురే పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూవివాదంలో ఎమ్మెల్యేపై ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎకరం 20 గుంటలు ముత్తిరెడ్డి పేరు మీద మార్చుకున్నారని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తుల్జా భవానీ రెడ్డి.
కాగా, ఇదివరకే ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూతురి ఫిర్యాదుతో మరోసారి భూవివాదం తెరపైకి వచ్చింది.