Nepal Casino : క్యాసినో వ్యవహారంలో సినీ తారల ప్రమేయంపై ఈడీ దృష్టి

చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ అదికారుల దర్యాప్తు కొనసాగుతోంది. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు ప్రచార కర్తలుగా వ్యవహరించిన సినీ తారలపై ఈడీ అధికారుల దృష్టి పెట్టారు.

Nepal Casino : క్యాసినో వ్యవహారంలో సినీ తారల ప్రమేయంపై ఈడీ దృష్టి

Nepal Casino

Updated On : July 28, 2022 / 9:22 PM IST

Nepal Casino :  చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ అదికారుల దర్యాప్తు కొనసాగుతోంది. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు ప్రచార కర్తలుగా వ్యవహరించిన సినీ తారలపై ఈడీ అధికారుల దృష్టి పెట్టారు. ప్రచారం చేసినందుకు సినీ తారలు లక్షల్లో డబ్బులు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ సినీ తారలకు నోటీసులు ఇచ్చి వారిని విచారించే యోచనలో ఈడీ అధికారులు ఉన్నారు.

క్యాసినో నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో సినీ తారల ప్రచార వీడియోస్ ప్రవీణ్ అప్లోడ్ చేసాడు. ప్రవీణ్ అప్లోడ్ చేసిన వీడియోస్ ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రవీణ్, మాధవరెడ్డి బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.

ప్రవీణ్, మాధవరెడ్డిల బ్యాంకు ఖాతాల నుంచి కొంతమంది సినీ ప్రముఖులకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. అమిషా పటేల్..గోవిందా..ముమైత్ ఖాన్..ఈషా రేబా..మేగా నాయుడు..మల్లికా షేరావత్..రాహుల్ సిప్లిగంజ్..లు క్యాసినో ప్రమోషన్ చేసిన సినీ తారలుగా గుర్తించిన అధికారులు వీరిక నోటీసులు ఇచ్చే ఆలోచన లో ఉన్నారు.

Also Read : Kodali Nani On Casino : దమ్ముంటే.. ఈడీతో నన్ను అరెస్ట్ చేయించండి-కొడాలి నాని సవాల్