ఆస్తి కోసం అక్కలనే చంపేశాడు, హైదరాబాద్ పాతబస్తీ డబుల్ మర్డర్ కేసులో కొత్త కోణాలు

హైదరాబాద్ లో సంచలనం రేపిన పాతబస్తీ డబుల్ మర్డర్ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు ఇస్మాయిల్ పథకం ప్రకారమే సొంత అక్కలను ఇంటికి పిలిచి మరీ హత్య చేశాడు. తల్లికి ఆరోగ్యం బాగోలేదు అంటూ ఇద్దరు అక్కలను ఇంటికి పిలిపించిన ఇస్మాయిల్ వారిపై కత్తితో దాడి చేశాడు. ఇస్మాయిల్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కలు(రజియా బేగం, జకిరా బేగం) స్పాట్ లోనే చనిపోయారు. ఆ తర్వాత బాలాపూర్ వెళ్లిన ఇస్మాయిల్ అక్కడ నివాసం ఉండే మూడో అక్క(నూరాబేగం)పైనా కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన బావపైనా దాడి చేశాడు. మూడో అక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా రంగంలోకి దిగారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. గతంలో భార్యను హత్య చేసి జైలుకి వెళ్లి వచ్చిన ఇస్మాయిల్ ఇప్పుడు ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టాడు. తన అక్కల మాటలు విని ఇస్మాయిల్ తన భార్యను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆస్తి పంపకాలు, తల్లికి ఆరోగ్యం లేదనే పేరుతో అక్కలను ఇంటికి పిలిపించిన ఇస్మాయిల్, కిచెన్ లో ఉన్న కత్తితో దాడి చేశాడు.
Read:కొడుకుని కనమంటే కూతుర్ని కంటావా? భార్యను చంపేస్తానంటూ ఆస్పత్రి పై దాడి..