పెళ్లైన 4 రోజులకే : షార్ట్ సర్క్యూట్‌తో నవ వధువు మృతి

పెళ్లైన నాలుగు రోజులకే షార్ట్ సర్క్యూట్ తో నవ వధువు మృతి చెందింది.

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 06:25 AM IST
పెళ్లైన 4 రోజులకే : షార్ట్ సర్క్యూట్‌తో నవ వధువు మృతి

Updated On : January 27, 2019 / 6:25 AM IST

పెళ్లైన నాలుగు రోజులకే షార్ట్ సర్క్యూట్ తో నవ వధువు మృతి చెందింది.

హైదరాబాద్ : పెళ్లింట్లో విషాదం నెలకొంది. కాళ్ల పారాణి ఆరలేదు. పెళ్లి తంతూ ఇంకా పూర్తికానేలేదు. అప్పుడే నవ వధువుకు నూరేళ్లు నిండాయి. ఆమెను కరెంట్ కాటేసింది. పెళ్లైన నాలుగు రోజులకే షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందింది. ఈఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.

 

సికింద్రాబాద్ కళాసీగూడ ముత్యాలమ్మ దేవాలయం ప్రాంతానికి చెందిన పరమేశ్వర్, షీమాదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురుకు గతంలోనే వివాహం జరిగింది. పరమేశ్వర్ మృతి చెందగా షీమాదేవి.. కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటుంది. రెండో కుమార్తె మనీషాకు జనవరి 22న నాంపల్లికి చెందిన కృష్ణ శర్మతో వివాహం జరిగింది. సికింద్రాబాద్ లోని సిక్ వాలా సమాజ్ లో ఘనంగా వివాహం జరిపారు. జనవరి 25 శుక్రవారం పుట్టింట్లో ఫంక్షన్ ఉండటంతో ఆమెను కళాసీగూడకు తీసుకుని వచ్చారు. రాత్రి కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుక జరిగింది. 

 

శనివారం ఉదయం స్నానం చేసేందుకు బాత్ రూమ్ లో బకెట్ లో హీటర్ పెట్టింది. నీళ్లు వేడి అయ్యాయో లేదో చూసేందుకు కరెంట్ స్విచ్ ఆఫ్ చేయకుండా హీటర్ ను బయటకు తీసింది. అదే సమయంలో హీటర్ ఆమె నడుముకు తగలడంతో షార్ట్ సర్క్యూట్ తగిలింది. దీంతో బాత్ రూమ్ లో కిందపడి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మనీషా కుటుంబ సభ్యులు, ఆమె భర్త కన్నీరుమున్నీరయ్యారు.