జుంబా డాన్స్ అంట.. ఇదో కొత్త రకం చీటింగ్..!

  • Published By: srihari ,Published On : June 12, 2020 / 04:48 PM IST
జుంబా డాన్స్ అంట.. ఇదో కొత్త రకం చీటింగ్..!

Updated On : June 12, 2020 / 4:48 PM IST

హైదరాబాద్‌లో కొత్త రకం చీటింగ్ ఒకటి బయటకు వచ్చింది. జుంబా డాన్స్ పేరుతో మోసానికి పాల్పడ్డారు. ధనిక వర్గాల మహిళా ఉద్యోగులు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త మోసానికి తెర లేపారు నిర్వాహకులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కొంతమంది మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ చీటింగ్ వెలుగులోకి వచ్చింది. 

ఫిట్ నెస్ కోసం జుంబా డాన్స్ వైపు మహిళలు మొగ్గుచూపుతున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని ప్రముఖులు టార్గెట్‌గా ఈ తరహా వ్యాపారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నిర్వాహకులపై ఇద్దరు మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతోనే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. జుంబా డాన్స్ నిర్వాహకుడిని పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.