ప్రేమ పెళ్లి పెద్దలు అంగీకరించ లేదని సఖి కేంద్రంలో నవ వధువు బలవన్మరణం

ప్రేమ పెళ్లి పెద్దలు అంగీకరించ లేదని సఖి కేంద్రంలో నవ వధువు బలవన్మరణం

Updated On : December 28, 2020 / 9:50 AM IST

Newly married bride ends life at sakhi center jangaon : ఇంట్లో పెద్దలు ప్రేమ పెళ్లిని అంగీకరించకపోవటంతో మనస్తాపానికి గురై నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన జనగామ జిల్లా కేంద్రం సఖి సెంటర్ లో జరిగింది. జిల్లాలోని కొడకండ్ల మండలం ఏడు నూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన నర్సయ్య కూతురు శ్రీలేఖ(20) అదే గ్రామానికి చెందిన దేశబోయిన మనోహర్(20) ప్రేమించుకున్నారు. డిసెంబర్ 16 న ఇద్దరూ ఇంట్లోనుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్ లో ఈనెల 22న ప్రేమికులిద్దరూ వివాహం చేసుకుని, గ్రామానికి తిరిగి వచ్చి రక్షణ కల్పించమని జనగామ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రెండు కుటుంబాల వారికి సమాచారం ఇచ్చారు. అయితే కొత్త జంటను తీసుకెళ్లేందుకు రెండు కుటంబాల వారు నిరాకరించారు.

దీంతో పోలీసులు శ్రీలేఖను రక్షణ కోసం జనగామ లోని సఖి కేంద్రానికి తరలించారు. సఖి సెంటర్ లో ఉంటూ మానసిక వేదనకు గురైన శ్రీలేఖ…..టాయిలెట్ డోర్ కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.