NIA Officers Raids : తెలంగాణలో ఎన్ఐఏ అధికారుల సోదాలు

దర్భంగా పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్‌లో ఇద్దరు సోదరులను అరెస్ట్ చేసిన వార్తలు మరిచిపోక ముందే ఎన్ఐఏ అధికారులు తెలంగాణలో పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఈసారి మావోయిస్టుల కేసుకు సంబంధించి అధికారులు సోదాలు చేశారు.

NIA Officers Raids : తెలంగాణలో ఎన్ఐఏ అధికారుల సోదాలు

Nia Officers Raids For Maoist Sympathisers Houses In Telangana

Updated On : July 19, 2021 / 11:20 PM IST

NIA Officers Raids : దర్భంగా పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్‌లో ఇద్దరు సోదరులను అరెస్ట్ చేసిన వార్తలు మరిచిపోక ముందే ఎన్ఐఏ అధికారులు తెలంగాణలో పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఈసారి మావోయిస్టుల కేసుకు సంబంధించి అధికారులు సోదాలు చేశారు.

దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముత్తు నాగరాజు, వి. సతీష్‌, మేడ్చల్‌లోని కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుంజి విక్రమ్‌, త్రినాథరావు, జనగామలో సూర సారయ్య, వరంగల్‌లో వేలుపు స్వామి ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో నిందితుల ఇళ్లనుంచి 400 ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు, 500 నాన్‌ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మావోయిస్టు నేత హిడ్మాకు పంపించటానికి సిధ్ధం చేస్తుండగా ఎన్‌ఐఏ అధికారులు పట్టుకున్నారు. పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.